డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డిగ్రీ పాసై ఉద్యోగం కోసం చూస్తున్నవారు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ ( ఏపీ )  స్కిల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) కింద ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా హిటేరో డ్రగ్స్ సంస్థలో ఉద్యోగ నియామకాలను చేపట్టనుంది. తాజా నోటిఫికేషన్‌ ద్వారా 200 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుకు చేసుకోవడానికి చివరి తేది డిసెంబర్ 18. అర్హత, ఆసక్తిగల పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 27 ఏళ్ల కంటే మించకూడదు.

విద్యార్హతలు: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఎస్‌సి(కెమిస్ట్రీ) పూర్తి చేసి ఉండాలి. 2016 నుండి 2020వరకు డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

also read కెనరా బ్యాంక్‌లో ఉద్యోగాలు‌.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే అప్లయి చేసుకోండీ.. ...

జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.11 వేల వరకు వేతనం ఉంటుంది. దీంతో పాటు ప్రొడక్షన్ అలవెన్స్ కింద రూ.500, ప్రొడక్షన్‌ ఎక్స్‌పెన్స్‌ కింద రూ.2 వేలు, నైట్ ఫిఫ్ట్ అలవెన్స్ రూ.2 వేలు, బోనస్ గా రూ.16800 చెల్లించనున్నారు.

దరఖాస్తు చేసుకునే విధానం: అధికారిక వెబ్ సైట్ https://www.apssdc.in/లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జిల్లా స్కిల్  డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఆధ్యర్యంలో అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు టెక్నికల్, సాఫ్ట్ స్కిల్స్ పై నెల పాటు శిక్షణ అందిస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఉద్యోగం కల్పిస్తారు.