ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) ఆధ్వర్యంలో జనవరి 12న భారీ ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ మూడు కంపెనీలు ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

ఇందులో అమరా రాజా బ్యాటరీస్, కుర్ట్జ్ క్రాఫ్ట్  ఎల్‌ఎల్‌పి, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన కూడా వెలువడింది. మరిన్ని పూర్తి వివరాల కోసం https://www.apssdc.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

అమరా రాజా బ్యాటరీస్: అమర్ రాజా బ్యాటరీస్ లో  మొత్తం 100 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. పదో తరగతి విద్యార్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు రూ.10,500 వేతనంతో పాటు ఫుడ్, వసతి సదుపాయాలను కల్పించనున్నారు. ఈ పోస్టులకు 25 ఏళ్ల లోపు వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

also read నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఎస్‌బీఐలో భారీగా ఉద్యోగాలు..ధరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి.. ...

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 10 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ చేసి 21-30 ఏళ్ల వయస్సు కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి రూ.15 వేల వేతనంతో పాటు ఇన్సెంటివ్స్ అందిస్తారు.

కుర్ట్జ్ క్రాఫ్ట్  ఎల్‌ఎల్‌పి: ఈ సంస్థలో మొత్తం 50 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులకు రూ.9 వేల వేతనంతో పాటు ఉచితంగా ఫుడ్‌, ఫ్రీ లోకల్ ట్రాన్స్‌పొటేషన్‌ కల్పిస్తారు. టెన్త్, ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ఉత్తీర్ణులై 18-50 ఏళ్ల మధ్య ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 12న ఉదయం 10 గంటలకు ప్రకాశం జిల్లా మార్కాపూర్ లోని ఐడియల్ డిగ్రీ కాలేజీలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చు. సందేహాలకు, పూర్తి వివరాలకు  8125215216 నంబరును సంప్రదించండీ.