Asianet News TeluguAsianet News Telugu

IOCL Recruitment: ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) మార్కెటింగ్ విభాగంలో టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 21 జనవరి 2020 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 

indian oil corporation limited jobs recruitment  notification for 2019
Author
Hyderabad, First Published Dec 30, 2019, 10:24 AM IST

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మార్కెటింగ్ విభాగంలో టెక్నీషియన్, ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు. డిప్లొమా, ఐటీఐ అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 21 జనవరి 2020 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. టెక్నీషియన్ & ట్రేడ్ అప్రెంటిస్ ఉన్న మొత్తం ఖలీలు 312.

అర్హత: టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు 50 శాతం మార్కులతో డిప్లొమా (ఇంజినీరింగ్), ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఐటీఐ అర్హత పొంది ఉండాలి. ఇంజినీరింగ్ డిగ్రీ, లా డిగ్రీ, పీజీ డిగ్రీ అర్హత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు.

also read Bank Jobs: ఆర్‌బి‌ఐలో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు....


డిప్లొమా విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్.


ఐటీఐ ట్రేడ్లు: మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ .

వయోపరిమితి: అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 30.11.2019 నాటికి 18-24 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

also read Airforce Jobs: ఎయిర్ ఫోర్స్ లో ఇంటర్‌ అర్హతతో ఉద్యోగాలు..

ఎంపిక విధానం: రాతపరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.12.2020 చివరితేది: 22.01.2020

అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ తేదీ: 28.01.2020

రాతపరీక్ష నిర్వహించే తేది: 02.02.2020

Follow Us:
Download App:
  • android
  • ios