హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ ‌(హెచ్‌పీసీఎల్‌) స‌బ్సిడ‌రీ సంస్థ అయిన హెచ్‌పీసీఎల్ బ‌యోఫ్యూయ‌ల్స్ లిమిటెడ్ లో ఒప్పందం కింద వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

వీటిలో డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ ఆఫీస‌ర్‌, ల్యాబ్ కెమిస్ట్ తో పాటు తదితర పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మెరిట్‌ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. మొత్తం ఖాళీగా ఉన్న పోస్టుల సంఖ్య 51.

ఖాళీగా ఉన్న పోస్టులు: డిప్యూటీ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీర్‌, ఎన్విరాన్‌మెంట‌ల్ ఆఫీస‌ర్‌, ల్యాబ్ కెమిస్ట్, బాయిల‌ర్‌ త‌దిత‌ర పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

అర్హ‌త‌: పోస్టును బట్టి ప‌దో త‌ర‌గ‌తి, సంబంధిత స‌బ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా(ఇంజినీరింగ్‌), బీఎస్‌సి, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎం‌ఎస్‌సి  ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం తప్పనిసరి ఉండాలి.

also read  ఐ‌టి‌ఐ అర్హతతో డీఆర్‌డీఓలో అప్రెంటిస్‌లు పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.. ...

ఎంపిక చేసే విధానం: మెరిట్ ఆధారంగ లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికలు  ఉంటాయి.

ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: ఈమెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అధికారిక ఈ-మెయిల్‌: recruitment@hpclbiofuels.co.in

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: అక్టోబర్‌ 10, 2020

అభ్యర్థులు మరింత పూర్తి సమాచారం కోసం http://www.hpclbiofuels.co.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.