బీటెక్ చేసిన వారికి ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసిఐఎల్) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
బీటెక్ చేసి ఉద్యోగం కోసం చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసిఐఎల్) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత ఆసక్తి గల అభ్యర్ధులు ఈ జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు మరింత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్ http://www.ecil.co.in/చూడవచ్చు.
ఎంపికైన అభ్యర్థులు మొదట కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయాల్సి ఉంటుంది. అలాగే అభ్యర్థులకు నెలకు రూ. 23 వేల వేతనం చెల్లిస్తారు.
విద్యార్హతలు: సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ చదివి 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక చేసే విధానం: మొదట అభ్యర్థులను వారి మార్కులు, అనుభవం ఆధారంగా 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తారు. తరువాత షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వర్చువల్ గా ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ లో అభ్యర్థుల ప్రతిభ, అనుభవం ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈసిఐఎల్ అధికారిక వెబ్ సైట్ http://www.ecil.co.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
1.మొదట ఈసిఐఎల్ వెబ్ సైట్ ఓపెన్ చేసిన తరువాత ‘Careers’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
2.తరువాత ‘e-Recruitment’ ఆప్షన్ పై నొక్కండి.
3.ఇక్కడ మీరు మీ వివరాలను పూర్తిగా నింపి సబ్‌మిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
4. దీంతో మీ ధరఖాస్తు ప్రక్రియ పూర్తి అవుతుంది.
భవిష్యత్తు ఉపయోగం కోసం మీ ధరఖాస్తును ఒక ప్రింట్ తీసుకుని పెట్టుకోవడం మంచిది.