గుంటూరులోని డిఎంహెచ్‌ఓ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్దతిలో మెడికల్ ఆఫీసర్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ ఖాళీలు డిఎంహెచ్‌ఓ గుంటూరు అర్బన్ పిహెచ్‌సిలో ఉన్నాయి.
వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యాధికారులను భర్తీ చేసేందుకు జిల్లా పాలనాధికారి పేరుతో డిసెంబరు 14న ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. గుంటూరులోని డిఎంహెచ్‌ఓ జిల్లా వైద్య, ఆరోగ్య కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్దతిలో మెడికల్ ఆఫీసర్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఈ ఖాళీలు డిఎంహెచ్‌ఓ గుంటూరు అర్బన్ పిహెచ్‌సిలో ఉన్నాయి. మొత్తం 66 పోస్టులను డిఎంహెచ్‌ఓ గుంటూరు మెడికల్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2020 ద్వారా భర్తీ చేయనున్నారు. అర్హతగల వైద్యులు 23-11-2020 అంతకు ముందులోగా డిఎంహెచ్‌ఓ గుంటూరుకు దరఖాస్తులను సమర్పించవచ్చు.
డిఎంహెచ్‌ఓ గుంటూరు మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాల ఎంపికలు అర్హత, అనుభవంలో మెరిట్ ఆధారంగా ఉంటాయి. పూర్తి వివరాలు https://guntur.ap.gov.in/ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
also read డిగ్రీ పాసైన నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పరీక్ష లేకుండా ప్రముఖ సంస్థలో 200 ఉద్యోగాలు.. ...
ఈ పోస్టులకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ (ఏపీఎంసీ)లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థుల వయసు 42 ఏళ్లు మించకూడదు. ఎస్సీ / ఎస్టీ / బీసీ అభ్యర్థులకు వయోపరిమితి 47 సంవత్సరాలు.
రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులు ఉంటాయి. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 10 నుండి 21 అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.500 చెల్లించాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో కింది అడ్రస్‌కి దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.
డిఎంహెచ్‌ఓ నిబంధనల ప్రకారం మెడికల్ ఆఫీసర్ జీతం: రూ .53495 / -.
ధరఖాస్తు పంపించాల్సిన చిరునామా:
District Medical and Health Officer,
Guntur Opp. Collectorate,
Nagarampalem, Guntur
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Dec 15, 2020, 4:07 PM IST