Asianet News TeluguAsianet News Telugu

బీటెక్‌, బీఈ పాసైన వారికి ఇంజినీర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35 వేల జీతం..

భారతీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో 137 ట్రెయినీ ఇంజినీర్‌/ ట్రెయినీ ఆఫీస‌ర్‌, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

BEL Recruitment 2020 for Trainee Engineer/Project Engineer  146 Posts Last Date: 26 December 2020
Author
Hyderabad, First Published Dec 17, 2020, 2:23 PM IST

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో ఇంజనీర్లు / ఆఫీసర్లు (ట్రైనీ ఇంజనీర్-ఐ / ప్రాజెక్ట్ ఇంజనీర్-ఐ / ట్రైనీ ఇంజనీర్- II / ట్రైనీ ఆఫీసర్-ఐ / ప్రాజెక్ట్ ఆఫీసర్-ఐ / మేనేజ్‌మెంట్ ఇండస్ట్రియల్ ట్రైనీలు) ఖాళీలకు అర్హతగల అభ్యర్థుల నుండి ఉద్యోగ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

సంబంధిత రంగంలో అనుభవం ఉన్న బి.ఈ/ బి. టెక్/ బి.ఎస్‌సి/ సి‌ఏ / ఐ‌సి‌డబల్యూ‌ఏ/ ఎం‌బి‌ఏ అర్హతగల అభ్యర్థులు బెల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

ఎంపిక ప్రక్రియ అకాడమిక్ పర్ఫర్మెంస్ / ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.  ఈనెల 26 దరఖాస్తుకు చివరితేది.  అభ్యర్థులు పూర్తి వివరాలకు https://www.bel-india.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీలు: 137

ట్రెయినీ ఇంజినీర్- 70 (ఈసీఈ-40, మెకానిక‌ల్‌-11, కంప్యూట‌ర్ సైన్స్‌-19)
ట్రెయినీ ఆఫీస‌ర్‌- 06 (ఫైనాన్స్‌-06)
ప్రాజెక్ట్ ఇంజినీర్- 61 (ఈసీఈ-30, మెకానిక‌ల్‌-10, కంప్యూట‌ర్ సైన్స్‌-17, ఎల‌క్ట్రిక‌ల్‌-01, సివిల్‌-02, ఎరోనాటిక‌ల్‌-01)

అర్హ‌త‌: స‌ంబంధిత విభాగాల్లో నాలుగేళ్ల‌ బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌), ఎంబీఏ(ఫైనాన్స్‌) ఉత్తీర్ణ‌త‌తో అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: 30.11.2020 నాటికి ట్రెయినీ ఇంజినీర్, ట్రెయినీ ఆఫీస‌ర్‌(జ‌న‌ర‌ల్‌)-25 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీర్(జ‌న‌ర‌ల్‌)-28 ఏళ్లు మించ‌కూడ‌దు. ఓబీసీల‌కు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, పీడ‌బ్ల్యూడీల‌కు ప‌దేళ్లు గరిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
జీతం: ట్రెయినీ ఇంజినీర్‌/ ట‌్రెయినీ ఆఫీస‌ర్ పోస్టుల‌కు నెల‌కు రూ. 25,000, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల‌కు నెల‌కు రూ.35,000 వేత‌నం చెల్లిస్తారు.

also read పరీక్ష లేకుండా హైద‌రాబాద్‌ ఇసిఐఎల్ లో ఉద్యోగాలు‌.. డిసెంబర్ 31లోగా ధరఖాస్తు చేసుకోండీ.. ...
ఎంపిక విధానం: ఎంపిక ప్ర‌క్రియ‌ను మొత్తం 100 మార్కుల‌కు విభ‌జిస్తారు. విభాగాల వారీగా వాటికి వెయిటేజి కేటాయించి తుది ఎంపిక చేస్తారు.
1) బీఈ, బీటెక్‌, బీఎస్సీ(ఇంజినీరింగ్‌)లో సాధించిన మార్కుల‌కు - 75% లేదా 75 మార్కులు
2) ప‌ని అనుభ‌వం ఆధారంగా (ప్ర‌తి ఆరునెల‌ల‌కు 2.5 మార్కుల చొప్పున కేటాయిస్తారు) - 10% లేదా 10 మార్కులు
3) ఇంటర్వ్యూ (వీడియో ప‌ద్ధ‌తిలో) - 15% లేదా 15 మార్కులు
ద‌ర‌ఖాస్తు ఫీజు: జ‌న‌ర‌ల్/ ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు (ట్రెయినీ ఇంజినీర్‌/ ట‌్రెయినీ ఆఫీస‌ర్‌)- రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్‌కి రూ.500 ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థులకు ఫీజు లేదు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: డిసెంబర్‌ 26, 2020.
అధికారిక వెబ్‌సైట్‌:https://www.bel-india.in/

Follow Us:
Download App:
  • android
  • ios