బీటెక్ లేదా డిప్లొమాతో బీడీఎల్‌లో అప్రెంటిస్‌లు పోస్టులు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) అప్రెంటిస్ చట్టం 1973 ప్రకారం ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
హైదరాబాద్: కేంద్ర రక్షణశాఖ పరిధిలో పనిచేసే భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) అప్రెంటిస్ చట్టం 1973 ప్రకారం ఒక సంవత్సరం అప్రెంటిస్ షిప్ శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేట్ / డిప్లొమా హోల్డర్స్ (నవంబర్ 2017/2018/2019 & 2020 మధ్య ఉత్తీర్ణత) బిడిఎల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2020 కోసం 02 నవంబర్ 2020 నుండి 18 నవంబర్ 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇందులో మెదక్ జిల్లాలోని భానూర్ బీడీఎల్‌లో కూడా ఖాళీలు ఉన్నాయి. భానూర్‌లోని ఖాళీలకు నవంబర్ 20లోపు దరఖాస్తు చేసుకోవాలి.
అప్రెంటిస్ షిప్ వ్యవధి అప్రెంటిస్ చట్టం 1973 ప్రకారం ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
also read బ్యాంక్ ఉద్యోగాల నోటిఫికేషన్ గడువు పొడిగింపు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ ...
మొత్తం అప్రెంటిస్‌ల సంఖ్య: 119
గ‌్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు-83,
టెక్నీషియన్ అప్రెంటిస్-36
అర్హత: బీటెక్ లేదా డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ప్రారంభ తేదీ: నవంబర్ 2
దరఖాస్తు చివరి తేదీ: నవంబర్ 18
అధికారిక వెబ్‌సైట్: www.mhrdnats.gov.in
జీతం / స్టైపెండ్:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - రూ .8000 / -
టెక్నీషియన్ అప్రెంటిస్ - రూ .9000 / -
వయో పరిమితి: అప్రెంటిస్‌షిప్ నిబంధనల ప్రకారం వయోపరిమితి ఉంటుంది.