మీరు 10వ తరగతి అర్హతతో ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏ‌పి‌ఎస్‌ఎస్‌డి‌సి) తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ డెలివరీ ఎగ్జిక్యూటివ్స్ ఉద్యోగాల భర్తీకి నియామకాలను చేపట్టింది. ఈ మేరకు ఫ్లిప్ కార్ట్ సంస్థ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 20 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. అనుభవం ఉన్న వారు, ఫ్రెషర్లు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపింది.

also read ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో భారీగా ఉద్యోగాలు‌.. డిగ్రీ, బిటెక్ నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. ...

అభ్యర్థుల వయసు 18-30 ఏళ్ల వయస్సు ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారికి డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఎల్‌ఎల్‌ఆర్‌, స్మార్ట్ ఫోన్ తో పాటు టూ వీలర్ వాహనం తప్పనిసరి ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని  ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉద్యోగం చేయాల్సి  ఉంటుంది.

గమనిక: ఆంధ్రప్రదేశ్ లేదా స్థానిక అభ్యర్థులకు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. 

దరఖాస్తుకు చివరి తేది: 4 జనవరి 2021   

మరిన్ని పూర్తి వివరాలకు https://www.apssdc.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.