Asianet News TeluguAsianet News Telugu

డిగ్రీ, బీటెక్ అర్హతతో ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు.. లక్షకు పైగా జీతం..

ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏ‌ఏ‌ఐ)లో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు AAI అధికారిక సైట్ https://www.aai.aero/ లో  పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

AAI Recruitment 2020: Apply for 368 Manager & Executive posts on aai.aero- check details here
Author
Hyderabad, First Published Dec 1, 2020, 5:22 PM IST

భార‌త ప్ర‌భుత్వ పౌర ‌విమాన‌యాన మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏ‌ఏ‌ఐ)లో మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు AAI అధికారిక సైట్ https://www.aai.aero/ లో  పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులు ఫైర్ స‌ర్వీస్‌, టెక్నిక‌ల్‌, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌, ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్‌, టెక్నిక‌ల్ తదితర విభాగాల్లో ఉన్నాయి. దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ 15 డిసెంబర్ 2020 నుండి చివరి తేదీ 14 జనవరి 2021. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 368 పోస్టులను భర్తీ చేస్తుంది.

మొత్తం ఖాళీలు: 368
మేనేజర్ (ఫైర్ సర్వీసెస్)- 11 
మేనేజర్ (టెక్నికల్)-2
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)-264
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (విమానాశ్రయ కార్యకలాపాలు)-83
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్)-8

విభాగాలు: ఫైర్ స‌ర్వీస్‌, టెక్నిక‌ల్‌, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌, ఎయిర్‌పోర్ట్ ఆప‌రేష‌న్స్‌, టెక్నిక‌ల్ తదితర విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి‌.

also read డిగ్రీ, పీజీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే అప్లయి చేసుకోండీ.. ...

అర్హ‌త‌: పోస్టును బట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో బ్యాచిల‌ర్స్ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ ఉత్తీర్ణ‌త‌, మేనేజ‌ర్ లెవెల్ పోస్టులకు అనుభ‌వం ఉండాలి. జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ పోస్టులకు అనుభ‌వం అవ‌సరం లేదు.

వ‌య‌సు: 30.11.2020 నాటికి మేనేజ‌ర్‌ పోస్టుకు-32 ఏళ్లు, జూనియ‌ర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు 27 ఏళ్లు మించి ఉండ‌కూడ‌దు.

ఎంపిక చేసే విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, సర్టిఫికేట్ వెరిఫికేష‌న్/ ఇంట‌ర్వ్యూ/ ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్‌, ఎండ్యూరెన్స్ టెస్ట్‌/ డ్రైవింగ్ టెస్ట్‌/ వాయిస్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం: మేనేజర్ (ఈ-3) - రూ.60000 -1,80,000

జూనియర్  ఎగ్జిక్యూటివ్ (ఈ-1) - రూ.40,000-1,40,000

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి‌.

వెబ్‌సైట్‌:https://www.aai.aero/

ప్రాథమిక వేతనంతో పాటు, డియర్నెస్ అలవెన్స్, 35% ప్రాథమిక వేతనం, హెచ్‌ఆర్‌ఏ, సిపిఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటి స్కీంస్, వైద్య ప్రయోజనాలతో పాటు మొదలైన ఇతర ప్రయోజనాలు ఏ‌ఏ‌ఐ నిబంధనల ప్రకారం ఉంటాయి.

ధరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా 1000/-రూపాయలు చెల్లించాలి, ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు కేవలం రూ.170/-. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఏ‌ఏ‌ఐ అధికారిక వెబ్ సైట్‌ను సందర్శించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios