రాత పరీక్ష లేకుండా 10th పాసైన వారికి ఉద్యోగాలు.. ఏపీ, తెలంగాణలో నియమకాలు..

 నెహ్రూ యువ కేంద్ర సంగ‌థాన్ ‌(ఎన్‌వై‌కే‌ఎస్ ) 2021-2022 సంవ‌త్స‌రానికి 13,206 పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులను  ఆహ్వానిస్తున్నది. పదో తరగతి పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 

nyks recruitment 2021 released apply for 13206 volunteers posts at nyks nic in

 భార‌త ప్ర‌భుత్వ యువ‌జ‌న వ్య‌వ‌హారాలు, క్రీడ‌ల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంగ‌థాన్ ‌(ఎన్‌వై‌కే‌ఎస్ ) 2021-2022 సంవ‌త్స‌రానికి 13,206 పోస్టుల భ‌ర్తీ కోసం ద‌ర‌ఖాస్తులను  ఆహ్వానిస్తున్నది.

పదో తరగతి పాసైన అభ్యర్థులు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ఫిబ్రవరి 20 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. మరింత సమాచారం లేదా పూర్తి వివరాలకు https://nyks.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య : 13,206

అర్హ‌త‌: క‌నీసం ప‌దో త‌ర‌గ‌తి పాసై ఉండాలి‌.

వ‌య‌సు: 01.04.2021 నాటికి 18-29 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.

ఎంపిక విధానం: ఉన్న‌త విద్యార్హ‌త‌లు, మెరిట్‌, కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌లో బేసిక్ నాలెడ్జ్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. స్మార్ట్‌ మొబైల్ ఫోన్ వాడ‌కం, వివిధ యాప్స్(ఈ-బ్యాంకింగ్‌/ డిజిధ‌న్‌, సోష‌ల్ మీడియా త‌దిత‌రాలు) గురించి బేసిక్ నాలెడ్జ్ ఉన్న వారికి ప్రాధాన్య‌త ఉంటుంది‌.

also read ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. బీటెక్‌/ఎంబీఏ అర్హుత ఉంటే చాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ ...

ఇంటర్వ్యూ సమయంలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కోసం  పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు, అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురావాల్సి ఉంటుంది.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

జీతం: నెల‌కు రూ.5000 చెల్లిస్తారు.

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేదీ : 05 ఫిబ్రవరి 2021.

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 20 ఫిబ్రవరి 2021.

ఫ‌లితాల వెల్ల‌డి: 15 మార్చి 2021.

జాయినింగ్ తేది: 01 ఏప్రిల్‌ 2021.

అధికారిక వెబ్‌సైట్‌:https://nyks.nic.in/

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios