Asianet News TeluguAsianet News Telugu

Government Jobs 2022: నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌.. ఈ ఉద్యోగాల‌కు ద‌ర‌ఖాస్తు చేశారా..!

ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ ఉద్యోగాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. ఏదైనా జాబ్ గురించి ప్రకటన వస్తే చాలు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాల్సి ఉంటుంది. చివరి తేదీ సమీపిస్తున్న కొన్ని ఉద్యోగాల వివరాలిలా ఉన్నాయి.
 

Latest Government Jobs Notifications 2022
Author
Hyderabad, First Published Apr 5, 2022, 12:57 PM IST

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆశావహుల కోసం పలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉద్యోగ నోటిఫికేషన్‌ను జారీ చేశాయి. ఇక అభ్యర్ధులు అర్హత ప్రమాణాలను బట్టి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి ముందు, దరఖాస్తుదారులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అర్హత ప్రమాణాలు, దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, దరఖాస్తు చేయడానికి చివరి రోజును చెక్ చేయాలి.


పోస్టుల వివరాలు 

ఈశాన్య రైల్వే

నార్త్ ఈస్టర్న్ రైల్వే స్పోర్ట్స్ కోటా కింద అనేక పోస్టులను ఆఫర్ చేస్తోంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 26, ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది.దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 25, అభ్యర్థులు వెబ్‌సైట్‌ను ner.indianrailways.gov.in సందర్శించడం ద్వారాఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

NTPC

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ( NTPC ) ఆపరేషన్స్ - పవర్ ట్రేడింగ్, కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ -O&M , BD పవర్ ట్రేడింగ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం అనేక ఖాళీలను సూచిస్తు నోటీఫికేషన్ జారీ చేసింది. ఈ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి, గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. పోస్టులను బట్టి విద్యార్హతలు, పని అనుభవం వేర్వేరుగా ఉంటాయి. దరఖాస్తుదారులు వెబ్‌సైట్- ntpc.co.in ని సందర్శించి దరఖాస్తు చేసుకోవాలి. అప్లై చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 8.

RBI గ్రేడ్ B 2022

RBI గ్రేడ్-బి ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కనీసం ఏదైనా విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా ఏదైనా విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. దరఖాస్తుదారు వయస్సు కనీసం 21 సంవత్సరాలు కాగా వయో పరిమితి 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.అభ్యర్థులు rbi.org.inని సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 18, సాయంత్రం 6 గంటలు.

బ్యాంక్ ఆఫ్ బరోడా

బ్యాంక్ ఆఫ్ బరోడా 26 రాష్ట్రాల్లో 159 ఖాళీల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్ధుల కనీస వయసు 23 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితి 35 సంవత్సరాలు. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు కనీసం రెండు సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి, అందులో సంవత్సరం పాటు భారత్‌లోని బ్యాంకులు/ఆర్థిక సంస్థలు, సంబంధిత పరిశ్రమలతో NBFCలు/కలెక్షన్ ప్రొఫైల్‌లో ఉండాలి. దరఖాస్తుదారులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు bankofbaroda.in/Career వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 14.

Follow Us:
Download App:
  • android
  • ios