Asianet News TeluguAsianet News Telugu

ఐటీబీపీఎం సెక్టార్‌లో నియామకాల జోరు.. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో 3.75 లక్షల మంది రిక్రూట్‌మెంట్

ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (ఐటీ బీపీఎం) పరిశ్రమ 2022 ఆర్థిక సంవత్సరంలో 4.85 మిలియన్ల ఉద్యోగులను చేరుకోవడానికి 3.75 లక్షల మంది సిబ్బందిని నియమించుకోవచ్చని టీమ్‌లీజ్ డిజిటల్ (team lease digital ) అంచనా వేసింది

IT BPM Sector to Hire 3.75 Lakh Employees in FY22
Author
New Delhi, First Published Dec 24, 2021, 10:08 PM IST

ఇండియన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (ఐటీ బీపీఎం) పరిశ్రమ 2022 ఆర్థిక సంవత్సరంలో 4.85 మిలియన్ల ఉద్యోగులను చేరుకోవడానికి 3.75 లక్షల మంది సిబ్బందిని నియమించుకోవచ్చని టీమ్‌లీజ్ డిజిటల్ (team lease digital ) అంచనా వేసింది. సానుకూల పవనాల మధ్య ఉన్న పరిశ్రమ రాబోయే ఐదేళ్లలో 10 మిలియన్ల ఉద్యోగులను తాకే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే కాంట్రాక్ట్ సిబ్బంది ఈ బేస్‌లో 3 శాతం నుండి 6 శాతానికి పెరగవచ్చని నివేదిక పేర్కొంది.

అయితే ఇది కేవలం నియామకాలకు మాత్రమే పరిమితం కాలేదని, ఇది ఉద్యోగి-యజమాని కాంట్రాక్ట్ మోడల్‌ను కూడా ప్రభావితం చేస్తుందని నివేదిక పేర్కొంది. ఫుల్‌టైమ్ ఎంప్లాయ్‌మెంట్ వాల్యూమ్‌ను ఆదేశిస్తున్నప్పటికీ, 17 శాతం వృద్ధితో ఇది కాంట్రాక్ట్ స్టాఫ్‌గా ఉంది. మార్చి 2022 నాటికి ఐటీ కాంట్రాక్ట్ సిబ్బంది సంఖ్య 1.48 లక్షలకు చేరుకోవచ్చని అంచనా. 

డిజిటల్ స్కిల్స్‌కు డిమాండ్:

ఈ ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమ దృష్టి సారించినది డిజిటల్ నైపుణ్యాలపైనేని (Digital skills) నివేదిక వెల్లడించింది. డిజిటల్ స్కిల్స్‌లో, ప్రధానంగా 13 స్కిల్ సెట్‌లు ఎక్కువగా డిమాండ్‌లో ఉన్నాయి. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరంలో FY21 కంటే 7.5 శాతం వృద్ధిని నమోదు చేయవచ్చని అంచనా వేయగా.. కాంట్రాక్ట్ సిబ్బంది విషయంలోనూ ఇదే ధోరణి ఉంది.

డిజిటల్ స్కిల్స్ వున్న కాంట్రాక్ట్ సిబ్బందికి డిమాండ్ 50 శాతం పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. ఇది గతేడాదితో పోలిస్తే 19 శాతం పెరిగింది. డేటా ఇంజనీరింగ్ (data engineering) , డేటా సైన్స్ (data science),  మెషిన్ లెర్నింగ్ (machine learning), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాల (rtificial intelligence skills) కొరత పరిశ్రమను వేధిస్తోంది. ఈ క్రమంలోనే డిమాండ్-సప్లై మధ్య అంతరం విస్తరిస్తున్నట్లుగా నివేదిక కనుగొంది. సర్టిఫికేషన్‌తో సంబంధం లేకుండా (70 నుంచి 75 శాతం) మందికి, గ్రాడ్యుయేట్స్‌కి (10 నుంచి 15 శాతం), కాంట్రాక్ట్ ద్వారా (5 నుంచి 10 శాతం) మందిని నియమించుకుంటున్నాయి. 

డిమాండ్- సప్లై మధ్య అంతరం: 

ప్రస్తుతం భారతీయ ఐటీ బీపీఎం రంగం అపూర్వమైన వృద్ధిలో ఉందన్నారు టీమ్‌లీజ్ డిజిటల్ స్పెషలైజ్డ్ స్టాఫింగ్ హెడ్ సి సునీల్. అతిపెద్ద ప్రైవేట్ ఉపాధి రంగమైన ఐటీ బీపీఎం పరిశ్రమ భారతదేశాన్ని డిజిటల్ నైపుణ్యాలకు కేంద్రంగా మారుస్తోందని ఆయన అన్నారు. 43 శాతం తమ కస్టమర్‌లు ఈ ఏడాది డిజిటల్ నైపుణ్యాల నియామకాలను కనీసం 30 శాతం లేదా అంతకంటే ఎక్కువ పెంచాలని ఆశిస్తున్నారని సునీల్ చెప్పారు. అయితే సప్లై డిమాండ్ అంతరాన్ని సరిదిద్దేందుకు ఆయా సంస్థలు వారి వారి హెచ్‌ఆర్ వ్యూహాలను పునః సమీక్షించాల్సి ఉంటుంది అని సునీల్ సూచించారు.

Follow Us:
Download App:
  • android
  • ios