Asianet News TeluguAsianet News Telugu

Indian navy jobs:ఇండియన్ నేవీ ఆఫీసర్ 2019 నోటిఫికేషన్ విడుదల.

ఇండియన్ నేవీ ఆఫీసర్ నోటిఫికేషన్  నవంబరు 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు డిసెంబరు 19 వరకు ఆన్‌‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

indian navy officer notification released 2019
Author
Hyderabad, First Published Nov 23, 2019, 10:21 AM IST

ఇండియ‌న్ నేవీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న షార్ట్ స‌ర్వీస్ క‌మిష‌న్, పర్మనెంట్ కమిషన్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అవివాహిత పురుషులు, మ‌హిళా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

 

పోస్టుల  వివ‌రాలు.

ఆఫీసర్ పోస్టులు

ఖాళీల సంఖ్య: 144

విభాగాల వారీగా ఖాళీలు.

 ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (ఎస్ఎస్‌సీ): 76


విభాగం                                                            ఖాళీలు
నేవల్ ఆర్మమెంట్ ఇన్‌స్పెక్షన్ కేడర్                  06
ఏటీసీ                                                                 04
అబ్జార్వర్                                                            06
పైలట్ (MR)                                                       03
పైలట్ (MR)                                                       06
లాజిస్టిక్స్                                                            11
ఎస్‌ఎస్‌సీ X (IT)                                                 10
జనరల్ సర్వీస్ (GS/X)/హైడ్రో కేడర్                   30
మొత్తం ఖాళీలు                                                  76


అర్హత: 60 శాతం మార్కులతో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ (లేదా) పీజీ డిగ్రీ. లాజిస్టిక్ పోస్టులకు ఎంబీఏ/బీఎస్సీ/బీఎస్సీ(ఐటీ)/బీకామ్‌తో పాటు పీజీ డిప్లొమా (ఫైనాన్స్/లాజిస్టిక్స్/మెటీరియల్ మేనేజ్‌మెంట్) లేదా ఎంసీఏ/ఎంఎస్సీ (ఐటీ) ఉండాలి.

aslo read CCRAS'లో క్లర్క్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల


టెక్నిక‌ల్(ఎస్ఎస్‌సీ):    53

విభాగం                                                                 ఖాళీలు
ఇంజినీరింగ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)                     26
ఎలక్ట్రికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్)                         27
మొత్తం ఖాళీలు                                                        53
అర్హత: 60 శాతం మార్కులతో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉండాలి.


ఎడ్యుకేష‌న్ (పీసీ): 15

అర్హత: 60 శాతం మార్కులతో స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌. ఎంఎస్సీ (మ్యాథ్స్/ఫిజిక్స్/న్యూక్లియర్ ఫిజిక్స్/మెటియోరాలజీ/ఓషనాలజీ/అట్మాస్పియరిక్ సైన్స్).


వయోపరిమితి.

నేవల్ ఆర్మమెంట్ పోస్టులకు 02.01.1996 - 01.07.2001 మధ్య జన్మించి ఉండాలి.

ఏటీసీ పోస్టులకు 02.01.1996 - 01.01.2000 మధ్య జన్మించి ఉండాలి.

అబ్జార్వర్ పోస్టులకు 02.01.1997 - 01.01.2002 మధ్య జన్మించి ఉండాలి.

పైలట్ పోస్టులకు 02.01.1997 - 01.01.2002 మధ్య జన్మించి ఉండాలి.

లాజిస్టిక్స్, ఐటీ, హైడ్రో కేడర్, టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు 02.01.1996 - 01.07.2001 మధ్య జన్మించి ఉండాలి.

ఎడ్యుకేషన్ బ్రాంచ్ పోస్టులకు 02.01.1996  నుండి  01.01.2000 మధ్య జన్మించి ఉండాలి.

also read  Anganwadi Jobs: అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక‌ విధానం: ఇండియ‌న్ నేవీ నిర్వహించే ప్రవేశపరీక్ష (ఐఎన్ఈటీ), ఎస్ఎస్‌బీ ఇంట‌ర్వ్యూ, మెడిక‌ల్ టెస్ట్ ఆధారంగా.

 

శిక్షణ వివరాలు.

ఎంపికైనవారికి ఎజిమల(కేరళ)లోని ఇండియన్ నేవల్ అకాడమీలో శిక్షణనిస్తారు. అనంతరం నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

పైలట్ పోస్టులకు 22 వారాల నేవల్ ఓరియంటేషన్ కోర్సు ఉంటుంది. ఎస్‌ఎస్‌సీ ఐటీ ఆఫీసర్ పోస్టులకు మాత్రం 4 వారాలపాటు నేవల్ ఓరియంటేషన్ కోర్సు నిర్వహిస్తారు.

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.215. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.


ముఖ్యమైన తేదీలు.

ఆన్‌లైన్ దరఖాస్తు పక్రియ ప్రారంభం       29.11.2019.
ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రితేది                19.12.2019.

ప‌రీక్ష తేది    2020 ఫిబ్రవ‌రిలో.
కోర్సు ప్రారంభం:                                     2021 జ‌న‌వ‌రిలో.

Follow Us:
Download App:
  • android
  • ios