Asianet News TeluguAsianet News Telugu

యువకులకు గుడ్ న్యూస్.. ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయి చేసుకోండీ

ఇంటర్ చదివే వారికి గుడ్ న్యూస్. 10+2 అర్హతతో ఇండియన్ నేవీ  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయనుంది. 

indian navy sailor recruitment 2021 released apply online for 2500 aa ssr vacancies at joinindiannavy gov in
Author
Hyderabad, First Published Apr 26, 2021, 6:50 PM IST

 ఇండియన్ నేవీ  సెయిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2021 ఆగస్టు బ్యాచ్  ఆర్టిఫిషర్ అప్రెంటీస్ (ఏఆర్), సీనియర్ సెకండరీ రిక్రూట్స్ (ఎస్ఎస్ఆర్) పోస్టులను భర్తీ చేయనుంది.

అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. పూర్తి వివరాలకు https://www.joinindiannavy.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ చూడవచ్చు.

మొత్తం ఖాళీలు: 2500

ఆర్టిఫిషర్ అప్రెంటీస్– 500

సీనియర్ సెకండరీ రిక్రూట్స్ – 2000

1. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌(ఏఏ): 500

అర్హత: ఇంటర్మీడియెట్‌ లేదా 10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.

వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

2. సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌)–2000

అర్హత: ఇంటర్మీడియెట్‌ లేదా 10+2లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ/బయాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి.

వయసు: 01.02.2001 నుంచి 31.07.2004 మధ్య జన్మించి ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.215. ఎస్‌సి/ఎస్‌టి అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు.

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 26 ఏప్రిల్ 2021

చివరి తేది: 30 ఏప్రిల్ 2021
 
అధికారిక వెబ్‌‌సైట్:https://www.joinindiannavy.gov.in/
 

Follow Us:
Download App:
  • android
  • ios