Asianet News TeluguAsianet News Telugu

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రేపు ఊస్మానియా యూనివర్శిటీలో భారీ ఉద్యోగ మేళా..

 తార్నాక సమీపంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీల వద్ద  ఉద్యోగ మేళా నిర్వహి‌స్తున్నారు.  ఏఎ‌న్‌ఎం, జీఎ‌న్‌ఎం, బీఎస్‌సి నర్సింగ్‌ పూర్తి‌చేసి 18 నుంచి 35 ఏళ్ల లోపు‌వారు దీనికి అర్హు‌లని వెల్లడించారు. 

hyderabad job fair in osmania university on february 10 at arts college
Author
Hyderabad, First Published Feb 9, 2021, 4:04 PM IST

హైదరాబాద్ : ఈ నెల 10న అంటే రేపు ఉదయం తార్నాక సమీపంలో ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీల వద్ద  ఉద్యోగ మేళా నిర్వహి‌స్తున్నారు. ఇందులో భాగంగా అపోలో హోంకే‌ర్‌లో 130 పోస్టులకు జాబ్‌‌మే‌ళా నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎంప్లా‌య్‌‌మెంట్‌ ఇన్ఫర్మే‌షన్‌ అండ్‌ గైడెన్స్‌ బ్యూరో అధికారులు తెలిపారు.

ఏఎ‌న్‌ఎం, జీఎ‌న్‌ఎం, బీఎస్‌సి నర్సింగ్‌ పూర్తి‌చేసి 18 నుంచి 35 ఏళ్ల లోపు‌వారు దీనికి అర్హు‌లని వెల్లడించారు. మరింత సమాచారం లేదా పూర్తి వివ‌రా‌లకు 8247 656356 నంబ‌ర్‌లో సంప్రదించా‌లని సూచించారు.


 హెచ్‌సీఎల్‌ లో 1000 జాబ్స్‌
ఆంధ్రప్రదేశ్ విజయవాడ హెచ్‌సీఎల్‌ క్యాంపస్ ‌(గన్నవరం) కోసం వెయ్యి ఉద్యోగాలు భర్తీ   చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి 12, 13 తేదీల్లో నియామక ప్రక్రియ చేపడుతున్నట్లు ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీమతి శివశంకర్‌ ఇటీవల తెలిపారు.

also read డిగ్రీ, ఇంటర్‌, టెన్త్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్‌ చేసుకొండి.. ...

హెచ్‌సీఎల్‌ న్యూ విస్టాస్‌ కార్యక్రమం కింద వర్చువల్‌ విధానంలో నిర్వహించే ఈ నియామక ప్రక్రియకు ఇంజనీరింగ్‌ ఫ్రెషర్స్‌తో పాటు 2 ఏళ్ల నుంచి 8 ఏళ్ల అనుభవం ఉన్నవారు కూడా పాల్గొనవచ్చని వెల్లడించారు.

ప్రస్తుతం ఇక్కడ 1,500 మంది ఐటీ ఉద్యోగులున్నారని తెలిపారు. నాలుగేళ్లలో ఈ సంఖ్యను 5 వేలకు చేర్చాలన్నది తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనుభవజ్ఞులకు జావా, చిప్‌ డిజైనింగ్, డాట్‌నెట్‌ తదితర అంశాలపై టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు.

ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు ఈ డ్రైవ్‌ ఉంటుందని తెలిపారు. అలాగే ఆసక్తిగల అభ్యర్థులు ఫిబ్రవరి 11లోగా అధికారిక వెబ్ సైట్ https://www.hcltech.com/careers/vijayawada లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios