AP JOBS : ఆరోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల : మొత్తం 1113 పోస్టులు

ఆరోగ్య శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సరైన అర్హత ఉన్నవారు నిర్ణీత మొత్తం ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 1113 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.

health department announces notification for contract employees

ఆంధ్ర ప్రదేశ్ లోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో ఉద్యోగ కానుక అందజేసింది. ఈసారి పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శనివారం (నవంబరు 16) 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. జోన్ల వారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 29 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.


పోస్టుల వివరాలు...

* మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు


ఖాళీల సంఖ్య: 1113


కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది.

also read  CBSE jobs : సిబిఎస్‌ఇలో ఉద్యోగ అవకాశాలు

అర్హత: బీఎస్సీ(నర్సింగ్) డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు

వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 40 సంవత్సరాలలోపు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం : రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబరు 10న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించనున్నారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

పరీక్ష విధానం..

ఆన్‌లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 200 మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు.బీఎస్సీ(నర్సింగ్) సిలబస్ నుంచే ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 3 గంటలు. పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.  పరీక్షకు హాజరయ్యేవారు హాల్‌టికెట్‌తో పాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది. పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 50%, దివ్యాంగులకు 45%, ఎస్సీ-ఎస్టీలకు 40% గా నిర్ణయించారు.

also read   పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల : 3278 ఖాళీలు

శిక్షణ...
రాతపరీక్షల్లో అర్హత సాధించినవారికి ఆరునెలల శిక్షణ నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జి ప్రోగ్రామ్ (సర్టిఫికేట్) శిక్షణ కార్యక్రమం ప్రారంభంకానుంది. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియమించనున్నారు.

వేతనం...
ఉద్యోగాలకు ఎంపికైనవారికి వేతనంగా నెలకు రూ.25,000 అందజేస్తారు. శిక్షణ సమయంలో ఎలాంటి స్టైపెండ్ చెల్లించరు.

ముఖ్యమైన తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.11.2019.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.11.2019.

ప్రవేశ పరీక్షతేది: 10.12.2019.

బ్రిడ్జ్ కోర్సు కౌన్సెలింగ్: 23.12.2019.

బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం: 01.01.2020.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios