CBSE jobs : సిబిఎస్‌ఇలో ఉద్యోగ అవకాశాలు

సిబిఎస్ఇ  గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌గ్రాడ్యుయేట్లు, 10 + 2 పాస్ అభ్యర్థులకు ఉద్యోగాలు ప్రకటించింది. ఆన్‌లైన్‌లో లభించే దరఖాస్తు ద్వారా డిసెంబర్ 16 లోగా అప్లై చేసుకోవచ్చు. మొత్తం 357 ఖాళీలను సిబిఎస్ఇ బోర్డు ప్రకటించింది.

cbse announces administrative job notification

న్యూ ఢిల్లీ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ) వివిధ గ్రూప్ 'ఎ', గ్రూప్ 'బి', గ్రూప్ 'సి' పోస్టుల నియామకాలకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఆధారంగా బోర్డు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అసిస్టెంట్ సెక్రటరీ, ఎనలిస్ట్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అకౌంటెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల్లో మొత్తం 357 ఖాళీలను బోర్డు ప్రకటించింది. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తును డిసెంబర్ 16 లోపు సమర్పించవచ్చు.

also read PSC:మెడికల్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ విడుదల

జనరల్   కేటగిరీకి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 1500.  గ్రూప్ ఎ, గ్రూప్ బి / సి పోస్టులకు రూ. 800. ఎస్సీ / ఎస్టీ / పిడబ్ల్యుబిడి / ఎక్స్ సర్వీస్మెన్ కేటగిరీకి చెందిన అభ్యర్థులకు దరఖాస్తు రుసుము లేదు. మహిళా దరఖాస్తుదారులు, ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే సిబిఎస్‌ఇ యొక్క జనరల్ ఉద్యోగులు కూడా దరఖాస్తు రుసుము నుంచి మినహాయించబడ్డారు.

గ్రూప్ 'ఎ' పోస్టులకు ఎంపిక రాతపూర్వక లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. ఇతర పోస్టులకు ఎంపిక విధానం రాత పరీక్ష లేదా కంప్యూటర్ ఆధారిత పరీక్ష /  స్కిల్ టెస్ట్  ఉంటుంది.

also read పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల : 3278 ఖాళీలు


బోర్డు ఫిబ్రవరి నెల మధ్య నుండి సెకండరీ మరియు హయ్యర్ సెకండరీ స్థాయిలో వార్షిక పరీక్షలను నిర్వహిస్తుంది. పరీక్ష తేదీలను డిసెంబర్‌లో వెలువరుస్తారు. ఇది వరుసగా రెండవ సంవత్సరం, బోర్డు మార్చికి  బదులుగా ఫిబ్రవరి నెలలో క్లాస్ 10, 12 వార్షిక పరీక్షలను నిర్వహిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios