తమిళనాడు యూనిఫాం సర్వీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టిఎన్‌యుఎస్‌ఆర్‌బి) 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుళ్లు, జైలు వార్డెన్లు, ఫైర్‌మెన్‌ల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాడానికి అర్హత గల అభ్యర్థులను నుండి దరఖాస్తు ఆహ్వానిస్తూన్నారు.

ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా ఖాళీగా ఉన్న 10వేల పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ tnusrbonline.org ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమవుతుంది. అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 26 లోగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నియామక పరీక్ష డిసెంబర్ 23న నిర్వహించనున్నారు.

టిఎన్‌యుఎస్‌ఆర్‌బి రిక్రూట్‌మెంట్ 2020  పోస్టుల వివరాలు

also read ఉప్పల్‌ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ద్వార భ‌ర్తీ ...
పోలీస్ కానిస్టేబుల్ (సాయుధ దళాలు): 3,784
పోలీస్ కానిస్టేబుల్స్ (స్పెషల్ ఫోర్సెస్): 6,547
ఫైర్‌మెన్: 458
జైలు వార్డెన్: 119
మొత్తం: 10,908

దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు 10వ తరగతి లేదా గుర్తింపు పొందిన బోర్డు నుండి సమానమైన అర్హతలో ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష, శారీరక కొలత (పిఎమ్‌టి) ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేయడానికి గరిష్ట వయోపరిమితి 26 సంవత్సరాలు.

అధికారిక నోటిఫికేషన్ ప్రకారం రిజర్వు చేసిన అభ్యర్థులకు వయస్సు సడలింపు లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థికి నెలకు కనీస వేతనం రూ .18 వేలు ఇవ్వబడుతుంది. సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 26 వరకు అభ్యర్థులు వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.