Asianet News TeluguAsianet News Telugu

ఎట్టకేలకు: పంచాయతీ కార్యదర్శి నియామకాలకు గ్రీన్ సిగ్నల్

 తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వెంటనే నియామక ప్రక్రియను
చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల డీపీఓలను పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించింది.

Telangana: Junior Panchayat secretaries to take charge tomorrow
Author
Hyderabad, First Published Apr 12, 2019, 11:58 AM IST

తెలంగాణలో జూనియర్ పంచాయతీ కార్యదర్శి నియామకాలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గురువారం లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో వెంటనే నియామక ప్రక్రియను చేపట్టాల్సిందిగా అన్ని జిల్లాల డీపీఓలను పంచాయతీ రాజ్ శాఖ ఆదేశించింది.

ఈ క్రమంలో నియామక ఉత్తర్వులను డీపీఓలు సంబంధిత ఎంపీడీఓలకు పంపారు. ప్రభుత్వ వెబ్‌సైట్లో నియామక పత్రాలను అప్‌లోడ్ చేశారు. అభ్యర్థులు సంబంధిత ఎంపీడీఓల నుంచి నియామక పత్రాలను తీసుకుని.. తమకు కేటాయించిన గ్రామ పంచాయతీల్లో వెంటనే బాధ్యతలు చేపట్టాలని అధికారులు ఆదేశించారు. 

కాగా, పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే సమయంలో మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుందని పంజాయతీరాజ్ కమిషన్ పేర్కొంది.  ఎంపికైన అభ్యర్థులకు ఎవరికీ కూడా తమ సొంత గ్రామ పంచాయతీలో పోస్టింగ్ ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు.

ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నియామకాల ప్రక్రియ వెంట వెంటనే  జరుగుతుండటంతో పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios