SSC JOBS : ఎస్‌ఎస్‌సి నోటిఫికేషన్ 2020 విడుదల.. మొత్తం 5846 కానిస్టేబుల్ పోస్టులు..

 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు, మహిళల పోస్టుల కోసం మొత్తం 5846 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) రిక్రూట్‌మెంట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహిస్తుంది.

 

ssc notifications released for delhi police constable recruitment 2020 for 5846 vacancies check eligibility dates here

ఢీల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2020 కోసం ఎస్‌ఎస్‌సి(స్టాఫ్ సెలెక్షన్ కమిషన్) నోటిఫికేషన్ విడుదలైంది. కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు, మహిళల పోస్టుల కోసం మొత్తం 5846 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవచ్చు.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) రిక్రూట్‌మెంట్ పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సిబిటి) మోడ్‌లో నిర్వహిస్తుంది, తరువాత శారీరక సామర్థ్యం, శారీరక కొలత పరీక్షలు ఉంటాయి. అభ్యర్ధులు ssc.nic.in లో ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ దరఖాస్తు తేది ఆగస్టు 1 నుండి సెప్టెంబర్ 7. ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుము చెల్లించే చివరి తేదీ సెప్టెంబర్ 9 కాగా, ఆఫ్‌లైన్ బ్యాంక్ చలాన్‌ పేమెంట్ చివరి తేదీ సెప్టెంబర్ 11. ఆఫ్‌లైన్ చలాన్ ద్వారా దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 14. కంప్యూటర్ ఆధారిత పరీక్ష నవంబర్ 27 నుంచి డిసెంబర్ 14 మధ్య జరుగుతుంది.

పి‌ఈ&ఎం‌టి కోసం ప్రవేశ ధృవీకరణ పత్రాలను ఢీల్లీ పోలీసులు వారి వెబ్‌సైట్‌లో ( www.delhipolice.nic.in) జారీ చేస్తారు. పి‌ఈ&ఎం‌టి ఢీల్లీలో మాత్రమే నిర్వహించబడుతుంది.


ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఖాళీల వివరాలు:

కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు:  3433

కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)  పురుషులు (మాజీ సైనికులు ) : 226

కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) -పురుషులు  (మాజీ సైనికులు [కమాండో (పారా -3.2)] : 243

 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) - మహిళలు:  1944

మొత్తం ఖాళీలు : 5846

ఢీల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కోసం ఉండాల్సిన అర్హత:


గుర్తింపు పొందిన బోర్డు నుండి 10 + 2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణత. ఢీల్లీ పోలీసులకు సేవ చేస్తున్న కుమారులు / కుమార్తెలు, రిటైర్డ్ లేదా మరణించిన ఢీల్లీ పోలీస్ పర్సనల్ / మల్టీ టాస్కింగ్ స్టాఫ్, బండ్స్ మెన్, బగ్లర్స్, మౌంటెడ్ కానిస్టేబుల్స్, డ్రైవర్లు, డిస్పాచ్ రైడర్స్ మొదలైన వారికి ఆర్హత.

పురుష అభ్యర్థులు పి‌ఈ & ఎం‌టి తేదీ నాటికి ఎల్‌ఎం‌వి (మోటార్ సైకిల్ లేదా కారు) కోసం వాలిడిటీ అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. లెర్నింగ్ లైసెన్స్  కాదు.

ఢీల్లీ పోలీస్ కానిస్టేబుల్ జీతం 
పే స్కేల్: పే లెవల్ -3 (రూ. 21700- 69100)

ఢీల్లీ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్- పరీక్షా ప్యాటర్న్

కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కింద 100 మార్కులతో 100 ప్రశ్నలతో కూడిన ఒక ఆబ్జెక్టివ్ రకం మల్టిపుల్ చాయిస్ పేపర్‌ ఉంటుంది:

పార్ట్-ఎ జనరల్ నాలెడ్జ్ / కరెంట్ అఫైర్స్ - 50 ప్రశ్నలు - 50 మార్కులు

పార్ట్-బి రీజనింగ్ - 25 ప్రశ్నలు - 25 మార్కులు 

సీబీటీ: ఈ పరీక్షలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలలో ఉంటుంది.

పరీక్షలో జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, కంప్యూటర్ ఫండమెంటల్స్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ వర్డ్,  కమ్యూనికేషన్, ఇంటర్నెట్ తదితరాల పై ప్రశ్నలు ఇస్తారు.


ఎంపిక విధానం:

-కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), ఫిజికల్ ఎండ్యూరెన్స్ అండ్ మెజర్ టెస్ట్, వైద్యపరీక్షల ద్వారా ఎంపికచేస్తారు.

పరీక్ష కేంద్రాలు: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

పూర్తి వివరాల కోసం 
ఎంక్వయిరీ సెల్:  011-27412715, 011-27241205, 011-27241206 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios