Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండీ..!

లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్, జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్, పోస్ట‌ల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌‌ వంటి పోస్టుల భ‌ర్తీకి కంబైండ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ లెవ‌ల్ (సీహెచ్ఎస్‌ఎల్‌‌) నోటిఫికేష‌న్‌ను స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్‌ఎస్‌సీ) విడుద‌ల చేసింది. 

ssc  chsl 2020 notification released for  various posts  tier 1 exam held on april 12 details
Author
Hyderabad, First Published Nov 10, 2020, 11:47 AM IST

కేంద్ర ప్ర‌భుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్, జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్, పోస్ట‌ల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌‌ వంటి పోస్టుల భ‌ర్తీకి కంబైండ్ హ‌య్య‌ర్ సెకండ‌రీ లెవ‌ల్ (సీహెచ్ఎస్‌ఎల్‌‌) నోటిఫికేష‌న్‌ను స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్‌ఎస్‌సీ) విడుద‌ల చేసింది. అర్హ‌త‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్‌ 15 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ‌ మూడు ద‌శ‌ల్లో ఉంటుంది. మొద‌టి ద‌శ‌లో (టైర్‌-1) ఆబ్జెక్టివ్ టైప్ ప్ర‌శ్న‌లు, రెండో ద‌శ (టైర్‌-2)లో పెన్‌పేప‌ర్ (వ్యాస‌రూప ప్ర‌శ్న‌లు) ప‌రీక్ష‌, మూడో దశ‌లో స్కిల్ టెస్ట్ ఉంటుంది. అయితే మొత్తం ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయనేది వెల్ల‌డించ‌లేదు. అయితే గ‌తేడాది 4,893 పోస్టుల‌తో నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో పోస్టులు ఉండే అవ‌కాశం ఉన్నట్లు సమాచారం.

ఖాళీగా ఉన్న పోస్టులు:
1) లోయ‌ర్ డివిజ‌న్ క్ల‌ర్క్ (ఎల్‌డీసీ)/ జూనియ‌ర్ సెక్ర‌టేరియ‌ట్ అసిస్టెంట్
2) పోస్ట‌ల్ అసిస్టెంట్‌/ సార్టింగ్ అసిస్టెంట్
3) డేటా ఎంట్రీ ఆప‌రేట‌ర్‌‌

also read యుపిఎస్‌సి మెయిన్ ఎగ్జామినేషన్ 2020 టైమ్‌టేబుల్‌ విడుదల.. ప్ర‌తిరోజూ రెండు సెష‌న్ల‌లో ప‌రీక్ష‌ల నిర్...

అర్హ‌త‌: ఎల్‌డి‌సి, జేఎస్ఏ, పీఏ, ఎస్ఏ, డీఈఓ పోస్టుల‌కు ఇంట‌ర్ ఉత్తీర్ణ‌త‌ పొంది ఉండాలి. కాగ్ ఆఫీస్‌లో డీఈఓల‌కు ఎంపీసీతో ఇంట‌ర్ పాసై ఉండాలి.
వయసు: 18 నుంచి 27 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
ఎంపిక చేసే విధానం: రాత‌ప‌రీక్ష‌, టైపింగ్ లేదా స్కిల్ టెస్ట్‌ ద్వారా ఎంపికలు ఉంటాయి.
ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్‌ పద్దతిలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.100
ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: 15 డిసెంబ‌ర్ 2020
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపుల‌కు చివరితేదీ:  17 డిసెంబ‌ర్ 2020
టైర్‌-1 ప‌రీక్ష‌:  వచ్చే ఏడాది ఏప్రిల్ 12  నుంచి 27 వ‌ర‌కు ఉంటాయి
అధికారిక వెబ్‌సైట్‌:https://ssc.nic.in/

Follow Us:
Download App:
  • android
  • ios