బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ బ్యాంక్ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బి‌ఐ)లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వివిధ పోస్టులలో ఉన్న ఖాళీల సంఖ్య 92.

ఈ ఖాళీ పోస్టులు అన్నీ కూడా స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల కింద భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజనీరింగ్‌, పీజీ, సీఏ తదితర విద్యార్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ అక్టోబర్‌ 8, 2020. అభ్యర్థులు మరింత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.sbi.co.in/ లో చూడొచ్చు.


మొత్తం ఖాళీ పోస్టులు సంఖ్య  : 92
డేటా ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ - 1, డాక్టోరల్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ - 5, డేటా ట్రెయినర్‌ - 1, డేటా ట్రాన్స్‌లేటర్‌ - 1, సీనియర్‌ కన్సల్టెంట్‌ అనలిస్ట్‌ - 1, అసిస్టెంట్‌, జనరల్‌ మేనేజర్‌ - 1, డిప్యూటీ మేనేజర్‌ - 44, మేనేజర్‌ - 16, రిస్క్‌ స్పెషలిస్ట్‌ - 19, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ స్పెషలిస్ట్‌ - 3.

also read  నీట్ పీజీ, ఎం‌డి‌ఎస్ స‌హా వివిధ ప‌రీక్ష‌ల తేదీల‌ను ప్ర‌క‌టించిన నేషనల్ బోర్డ్.. ...

పోస్టు వివరాలు : స్పెషలిస్ట్‌ క్యాడర్‌ ఆఫీసర్‌
అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో బీటెక్‌, ఎంటెక్‌, సీఏ, పీజీ, గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
వయస్సు: పోస్టులను బట్టి 24-55 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.750 ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు నుంచి మింహాయింపు కల్పించారు.
దరఖాస్తులు ప్రారంభం తేదీ సెప్టెంబర్‌ 18, 2020
దరఖాస్తుకు చేసుకోవడానికి చివరితేది అక్టోబర్‌ 8, 2020
అధికారిక వెబ్‌సైట్‌:https://www.sbi.co.in/