Asianet News TeluguAsianet News Telugu

టెన్త్, ఐటీఐ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లయి చేసుకోవడానికి వెంటనే క్లిక్ చేయండి..

 ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్  అటెండెంట్ గ్రేడ్ I ఉద్యోగాలను ప్రకటించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులందరూ నేషనల్ ఫెర్టిలైజర్స్.కంలో చివరి తేదీలోగా ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

RFCL Recruitment 2021 released Attendant Grade I Vacancy - ITI - 21,500 - 52,000 Salary  Apply Now
Author
Hyderabad, First Published Dec 25, 2020, 3:01 PM IST

తెలంగాణ  పెద్దపల్లిలోని రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్  అటెండెంట్ గ్రేడ్ I ఉద్యోగాలను ప్రకటించింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులందరూ నేషనల్ ఫెర్టిలైజర్స్.కంలో చివరి తేదీలోగా ఈ పోస్టుల కోసం ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  

అటెండెంట్ గ్రేడ్‌-1 పోస్టులలో మొత్తం 31 ఖాళీలు భ‌ర్తీకి ఉన్నాయి. ఐటీఐలో మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగాల వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 12 జనవరి 2021 దరఖాస్తు చివరితేది. మరింత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ https://www.nationalfertilizers.com/ చూడొచ్చు.

మొత్తం ఉన్న  31 ఖాళీలలో మెకానిక‌ల్‌- 11, ఎల‌క్ట్రిక‌ల్‌- 12, ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌- 08 ఉన్నాయి.

అర్హ‌త: పోస్టును బట్టి ప‌దో త‌ర‌గ‌తి సంబంధిత స్పెష‌లైజేష‌న్‌లో ఐటీఐ(ఫిట్ట‌ర్‌, డీజిల్ మెకానిక్‌, మెకానిక్ రిపేర్ & హెవీ వెహికిల్ మెయింట‌నెన్స్, ఎల‌క్ట్రిషియ‌న్‌, ఎల‌క్ట్రానిక్స్ మెకానిక్‌, ఇన్‌స్ట్రుమెంటేష‌న్ మెకానిక్‌)లో ఉత్తీర్ణ‌త పొంది ఉండాలి‌.
వ‌య‌సు: 30 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు. ఎస్‌సి/ ఎస్‌టి అభ్య‌ర్థుల‌కు ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.200.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 12 జనవరి 2021.
వెబ్‌సైట్‌:https://www.nationalfertilizers.com/

ప‌రీక్ష విధానం: ఈ ఆన్‌లైన్ టెస్ట్‌లో రెండు పార్టులు ఉంటాయి. అందులో ఒక‌టి సంబంధిత స‌బ్జెక్టు, మ‌రోటి ఆప్టిట్యూడ్ స‌బ్జెక్టు ఉంటాయి. హిందీ, ఇంగ్లిష్ మాధ్య‌మాల్లో పరీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం 2 గంట‌లు ఉంటుంది. మొత్తం 150 ప్ర‌శ్ర‌లు ఉంటాయి.

అందులో 100 ప్ర‌శ్న‌లు మనం ఎంచుకున్న స‌బ్జెక్టు నుంచి ఇస్తారు. మిగ‌తా 50 ప్ర‌శ్న‌లు జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్ అండ్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్ నుంచి ఉంటాయి. మొత్తం 100 మార్కుల‌కుగాను 80శాతం మార్కుల‌ను ఆన్‌లైన్‌లో సాధించిన స్కోర్ ఆధారంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. మిగ‌తా 20శాతం మార్కుల‌ను స్కిల్‌టెస్ట్ ఆధారంగా లెక్కిస్తారు.  

Follow Us:
Download App:
  • android
  • ios