Asianet News TeluguAsianet News Telugu

పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. అప్లయి చేసుకోవడానికి వెంటనే క్లిక్ చేయండి..

న్యూఢీల్లీలోని ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ‌(పీఎఫ్‌సీ) కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న 41 పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు ఆహ్వనిస్తుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు.

pfc recruitment 2021 released apply online for 41 job vacancies at pfcindia com know here more
Author
Hyderabad, First Published Dec 31, 2020, 4:29 PM IST

భార‌త ప్ర‌భుత్వ ‌రంగానికి చెందిన న్యూఢీల్లీలోని ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ‌(పీఎఫ్‌సీ) కాంట్రాక్ట్ ప్రాతిప‌దిక‌న 41 పోస్టుల భ‌ర్తీకి ద‌రఖాస్తులు ఆహ్వనిస్తుంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూ నిర్వహిస్తారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. 18 జనవరి 2021 దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం https://www.pfcindia.com/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ప‌వ‌ర్ ఫైనాన్స్ కార్పొరేష‌న్ లిమిటెడ్ ఉన్న మొత్తం ఖాళీలు: 41
1. ప్రాజెక్ట్ కోఆర్డినేట‌ర్‌: 34
అర్హ‌త‌: ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌/ ఐటీ/ క‌ంప్యూట‌ర్ సైన్స్ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. క‌నీసం 5 ఏళ్ల అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: క‌నీస వ‌య‌సు 21 ఏళ్లకు త‌గ్గ‌కుండా, గ‌రిష్ఠ వ‌య‌సు 45 ఏళ్లకు మించ‌కుండా ఉండాలి.

2. క‌న్స‌ల్టెంట్ టెక్నిక‌ల్‌-1: 06
అర్హ‌త‌: ఎల‌క్ట్రిక‌ల్‌/ ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌/ ఐటీ/ క‌ంప్యూట‌ర్ సైన్స్ సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌. క‌నీసం ఐదేళ్ల సంబంధిత అనుభ‌వం ఉండాలి.
వ‌య‌సు: క‌నీస వ‌య‌సు 21 ఏళ్లకు త‌గ్గ‌కుండా, గ‌రిష్ఠ వ‌య‌సు 45 ఏళ్లకు మించ‌కుండా ఉండాలి.

also read 10వ తరగతి అర్హతతో ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాలు‌.. నెలకు 20వేల జీతం.. వెంటనే దరఖాస్తు చేసుకోండి ...

3. క‌న్స‌ల్టెంట్ టెక్నిక‌ల్‌-2: 01
అర్హ‌త‌: ఐటీ/ క‌ంప్యూట‌ర్ సైన్స్‌లో బీఈ/ బీటెక్‌/ ఎంసీఏ ఉత్తీర్ణ‌త‌. కనీసం మూడేళ్ల‌కు మించి సంబంధిత అనుభవం ఉండాలి. సంబంధిత టెక్నిక‌ల్ నైపుణ్యాల్లో నాలెడ్జ్ ఉండాలి.
వ‌య‌సు: క‌నీస వ‌య‌సు 21 ఏళ్లకు త‌గ్గ‌కుండా, గ‌రిష్ఠ వ‌య‌సు 45 ఏళ్లకు మించ‌కుండా ఉండాలి.

 ఎంపిక చేసే విధానం: అర్హ‌త‌లు క‌లిగిన అభ్య‌ర్థుల‌ను మొదట షార్ట్‌లిస్టింగ్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్య‌ర్థుల‌కు ఇంట‌ర్వ్యూకు  నిర్వహిస్తారు.
ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభ తేదీ : 29 డిసెంబర్‌ 2020.
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 18 జనవరి 2021.
అధికారిక వెబ్‌సైట్‌: https://www.pfcindia.com/

Follow Us:
Download App:
  • android
  • ios