NTPC Recruitment 2022: MBA చేశారా కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం, నెలకు 1.40 లక్షల వేతనం..ఇలా అప్లై చేయండి

NTPC Executive Trainee Recruitment 2022:  కేంద్ర ప్రభుత్వ సంస్థ NTPC ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇందుకోసం ఫైనాన్స్, మేనేజ్ మెంట్ రంగాల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులను అప్లై చేసుకోమని కోరుతోంది. ఆన్ లైన్ ద్వారా ఎలా అప్లై చేయాలో చెక్ చేసుకోండి. 

Ntpc Recruitment 2022 For Many Posts In National Thermal Power Corporation

NTPC Executive Trainee Recruitment 2022: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం యువతీయువకులు నిరంతరం ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు సాధించిన వారికి సదుపాయాల పరంగా మంచి వేతనంతో పాటు వసతి కూడా కల్పిస్తుంటారు. దీంతో యువత ఎక్కువగా ఈ సంస్థల్లో పని చేసేందుకు ఆసక్తి చూపుతారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో  ఉద్యోగ భద్రతతో పాటు పదవీ విరమణ అనంతరం బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.  ప్రస్తుతం  నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)లో ఉద్యోగం పొందాలనుకునే యువతకు పెద్ద అవకాశం. ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు ఖాళీలు ఉన్నాయి. 

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు మంచి పే స్కేల్ కూడా లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుండి నెలకు రూ. 1.40 లక్షల వరకు జీతం లభిస్తుంది. ఈ బేసిక్ పే కాకుండా, మీకు DA, HRA సహా అనేక ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. 

ఎన్ని ఖాళీలు ఉన్నాయి
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ (CA/CMA) Executive Trainee-Finance (CA/CMA) - 20 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్ (MBA) Executive Trainee-Finance (MBA-Fin) - 10 పోస్టులు
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్‌ఆర్  Executive Trainee-HR - 30 పోస్టులు
మొత్తం పోస్టుల సంఖ్య – 60

అర్హతలు ఇవే..
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్  ET ఫైనాన్స్ (CA/CMA) పోస్ట్ కోసం CA లేదా CMA ఉత్తీర్ణులు అయి ఉండాలి, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఫైనాన్స్  కోసం MBA  మేనేజ్‌మెంట్‌లో PG (ఫైనాన్స్‌లో స్పెషలైజేషన్), ఎగ్జిక్యూటివ్ ట్రైనీ హెచ్‌ఆర్  (ET HR) కోసం మేనేజ్‌మెంట్‌లో PG పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి గరిష్ట వయోపరిమితి 29 సంవత్సరాలు. ఈ వయస్సు దాటితే తర్వాత, అభ్యర్థులు దరఖాస్తు చేయలేరు.

ఎలా దరఖాస్తు చేయాలి
దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ప్రక్రియ ఇప్పటికే 7 మార్చి 2022 నుండి ప్రారంభమైంది. మీరు 21 మార్చి 2022 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ. 300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ ఉద్యోగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.

NTPC రిక్రూట్‌మెంట్ 2022: ఎలా దరఖాస్తు చేయాలి
>> ntpc.co.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.
>>  హోమ్‌పేజీలో కెరీర్ లింక్‌పై క్లిక్ చేయండి.
>>  కావలసిన పోస్ట్‌ను ఎంచుకుని, దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
>>  ఫారమ్‌ను సమర్పించి, భవిష్యత్ సూచన కోసం ప్రింటవుట్ తీసుకోండి.

ఎంపిక ప్రక్రియ
ఇందుకోసం ఎన్‌టీపీసీ జాతీయ స్థాయి పరీక్షను నిర్వహించనుంది. ఈ ఎంపిక ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతుంది. ఇందులో సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ (SKT), ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (EAT) అనే రెండు భాగాలు ఉంటాయి.

పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios