నెలకు 24వేల వేతనంతో ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకొండి..
జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఎన్‌టిపిసి ప్రాజెక్టుల్లో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌టిపిసి లిమిటెడ్)లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జార్ఖండ్, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ఎన్‌టిపిసి ప్రాజెక్టుల్లో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.
ఇంజనీరింగ్‌లో డిప్లొమా పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఎన్‌టిపిసి డిప్లొమా ఇంజనీర్ రిక్రూట్‌మెంట్ 2020ను అధికారిక వెబ్‌సైట్ https://ntpccareers.net/లో 23 నవంబర్ 2020 నుండి 12 డిసెంబర్ 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీ పోస్టులు - 70
మైనింగ్- 40
ఎలక్ట్రికల్- 12
మెకానికల్- 10
మైన్ సర్వే- 8
also read బీఈ, బీటెక్ అర్హతతో కెనరాబ్యాంకులో భారీగా ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...
ఎంపికైన అభ్యర్థులు వివిధ ఎన్‌టిపిసి బొగ్గు మైనింగ్ సైట్లలో 2 సంవత్సరాల పాటు శిక్షణ పొందుతారు. వారికి స్టైఫండ్ నెలకు రూ. 24,000. శిక్షణ విజయవంతంగా పూర్తయిన తర్వాత అభ్యర్థులకు ప్రాథమిక వేతనంలో డబ్ల్యూ 7 గ్రేడ్‌లో రూ. 24,000 / - పొందుతారు.
విద్యార్హతలు: మైనింగ్ పోస్టుకు డిప్లొమా ఇన్ మైనింగ్ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెకానికల్ పోస్టుకు డిప్లొమా ఇన్ మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మైన్ సర్వే పోస్టుకు డిప్లొమా ఇన్ మైన్ సర్వే లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా ఇన్ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్ కోర్సులను 70 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 25 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.300. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుండి మినహాయింపు కల్పించారు.
ఎంపిక చేసే విధానం: ఆన్‌లైన్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
స్టైఫండ్ : ఎంపికైన వారికి నెలకు రూ.24,000 స్టైఫండ్ ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభం: 23 నవంబర్ 2020
దరఖాస్తుకు చివరి తేదీ: 12 డిసెంబర్ 2020
వెబ్‌సైట్:https://ntpccareers.net/