ఢిల్లీ: నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, టెక్నీషియన్, సీనియర్ కన్సల్టెంట్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ నియామకాలు చేపడుతున్నారు. 

అర్హులైన అభ్యర్థులు ప్రకటన వెలువడిన నాటి నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ మే 28, 2019.

సీనియర్ రీసెర్చ్ ఆఫీసర్, టెక్నీషియన్, సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ పోస్టులకు సంబంధించిన అర్హతలను నోటిఫికేషన్‌లో పేర్కొనడం జరిగింది. పూర్తి వివరాల కోసం  http://ndma.gov.in ను సంప్రదించవచ్చు.

నోటిఫికేషన్‌లో పేర్కొనబడిన విధంగా అర్హులైన అభ్యర్థులు మే 28, 2019లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులతోపాటు అవసరమైన డాక్యుమెంట్లను కూడా జతచేసి పంపించాల్సి ఉంటుంది.