Asianet News TeluguAsianet News Telugu

నాబార్డులో స్పెషలిస్ట్ కన్సల్టెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగస్టు 23న ముగుస్తుంది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని నాబార్డ్ కోరింది. 
 

NABARD Recruitment 2020: Apply for Specialist Consultant posts  details here
Author
Hyderabad, First Published Aug 8, 2020, 1:49 PM IST

నాబార్డ్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్, నాబార్డ్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్ పోస్టుల కోసం అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. అర్హతగల అభ్యర్థులు నాబార్డ్ అధికారిక సైట్ ద్వారా నాబార్డ్.ఆర్గ్ లో ఈ పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 13 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. దీనికి సంబంధించిన ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఆగస్టు 23న ముగుస్తుంది. అర్హులైన‌, ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని నాబార్డ్ కోరింది. 

మొత్తం పోస్టులు 13

ఇందులో ప్రాజెక్టు మేనేజ‌ర్-2, సీనియ‌ర్ అన‌లిస్ట్‌-2, అన‌లిస్టిక్స్‌-చీఫ్ డాటా క‌న్స‌ల్టెంట్‌-1, సైబ‌ర్ సెక్యురిటీ మేనేజ‌ర్‌-1, అడిష‌న‌ల్ సైబ‌ర్ సెక్యురిటీ మేనేజ‌ర్‌-1, అడిష‌న‌ల్ చీఫ్ రిస్క్ మేనేజ‌ర్‌-2, రిస్క్ మేనేజ‌ర్ 4 పోస్టుల చొప్పున ఉన్నాయి. 

also read గేట్‌-2021లో మార్పులు.. కొత్త‌గా క్వ‌శ్చన్స్‌ పేపర్ లో మ‌రో సెక్ష‌న్‌.. ...

అర్హ‌త‌లు: స‌ంబంధిత స‌బ్జెక్టులో డ‌గ్రీ లేదా పీజీ పూర్తి చేసింది. అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. 

ఎంపిక విధానం: విద్యార్హ‌త‌, అనుభ‌వం ఆధారంగా ఒక్క పోస్టుకు 10 మంది చొప్పున ఇంట‌ర్వ్యూకి పిలుస్తారు. 

అప్లికేష‌న్ ఫీజు: ‌రూ.800, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు రూ.50

అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: ఆగ‌స్టు 23

అధికారిక వెబ్‌సైట్‌: nabard.org

Follow Us:
Download App:
  • android
  • ios