ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శ్రీహ‌రికోట‌లోని ఇస్రో-సతీష్ ధ‌వ‌న్ స్పేస్ సెంట‌ర్‌ (షార్‌) వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ డిగ్రీ, పీజీ లేదా ఎంబీబీఎస్ అర్హత పొందిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలీ. ఎంపిక చేసిన అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహించి ఉద్యోగ ఎంపికలు నిర్వహిస్తారు. నోటిఫికేషన్ మొత్తంలో ఉన్న ఖాళీల సంఖ్య 21.


సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల వివ‌రాలు.

also read UPSC Jobs: యూ‌పి‌సి‌ఎస్ నోటిఫికేషన్ విడుదల... ఇంజినీరింగ్ అర్హత

 సైంటిస్ట్/ ఇంజినీర్‌ పోస్టులు-19

విభాగాల వారీగా ఉన్న ఖాళీలు: కెమిక‌ల్ ఇంజినీరింగ్‌ : 10, ఇండ‌స్ట్రియ‌ల్ ఇంజినీరింగ్‌ : 02, ప‌వ‌ర్ సిస్ట‌మ్స్ : 03, ఇండస్ట్రియల్ సేఫ్టీ:  01, మెషిన్ డిజైన్/ ఇంజినీరింగ్ డిజైన్ : 02, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ : 01.

అర్హ‌త‌: సైంటిస్ట్/ ఇంజినీర్‌ పోస్టులకు స‌ంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎంఈ/ఎంటెక్ లేదా త‌త్స‌మాన అర్హ‌త కలిగి ఉండాలి.

మెడిక‌ల్ ఆఫీస‌ర్‌ పోస్టులు -02

విభాగాల వారీగా ఉన్న  ఖాళీలు: పీడియాట్రిక్స్ : 01, ఆప్తాల్మాలజీ : 01.

అర్హ‌త‌:  మెడికల్ ఆఫీసర్ పోస్టులకు ఎంబీబీఎస్ ఉత్తీర్ణ‌త‌తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా అర్హత ఉండాలి.

 వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 17.01.2020 నాటికి 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.

ద‌ర‌ఖాస్తు చేసుకునే విధానం: సరైన అర్హతలు ఉన్న  అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రింట్ కాపీని సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపించాలి.

also read Jio jobs: రిలయన్స్ జియోలో ఉద్యోగాలు... డిగ్రీ, పీజీ అర్హత ఉంటే చాలు

ఎంపిక చేసే విధానం: అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తుల్లో షార్ట్‌లిస్ట్ చేసిన వారికి రాతపరీక్ష, ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 28.12.2019 దరఖాస్తుకు చివ‌రి తేది 17.01.2020.


దరఖాస్తు హార్డ్ కాపీలు  27.01.2020 లోగా చేరేలా పంపించాలి.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా

Administrative Officer,

Recruitment Section,

Satish Dhawan Space Centre SHAR,

SRIHARIKOTA – 524124,

SPSR Nellore Dist, Andhra Pradesh.