Asianet News TeluguAsianet News Telugu

10వ తరగతి పాసైన వారికి ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ..

 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో కుక్, స్టీవార్డ్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్దేశిత ఫార్మాట్ లో joinindiancoastguard.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Indian Coast Guard Recruitment 2020 Notification Out apply at joinindiancoastguard.gov.in for Navik (DB) 10th Entry 01/2021 Batch
Author
Hyderabad, First Published Nov 19, 2020, 5:01 PM IST

భార‌త ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందిన‌ ఇండియన్ కోస్ట్ గార్డ్  నావిక్ పోస్టుల భ‌ర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 10వ తరగతి అర్హత ఉన్న వాళ్ళు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో కుక్, స్టీవార్డ్ తదితర పోస్టులున్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా నిర్దేశిత ఫార్మాట్ లో joinindiancoastguard.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ (డిబి) 10వ ఎంట్రీ బ్యాచ్ ఆన్‌లైన్ ఫారం 2020 నవంబర్ 30 నుండి  7 డిసెంబర్ 2020 వరకు joinindiancoastguard.gov.in లో అందుబాటులో ఉంటుంది. కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన విద్యా బోర్డు నుండి 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులకు ఇది ఒక గొప్ప అవకాశం.  

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : 30 నవంబర్ 2020
ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 7 డిసెంబర్ 2020

ఖాళీల వివరాలు
నావిక్ (డోమెస్టిక్ బ్రాంచ్) - 01/2021 బ్యాచ్ - 50 పోస్టులు

also read ఎయిమ్స్‌లో భారీగా ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...

విద్యా అర్హత: కేంద్ర / రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన విద్యా బోర్డు నుండి 50% మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి.
వయోపరిమితి - 18 నుండి 22 సంవత్సరాలు (ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది)

 ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ల‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్సెస్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్‌నెస్ (కరెంట్ అఫైర్స్ & జనరల్ నాలెడ్జ్) మరియు రీజనింగ్ (వెర్బల్ & నాన్-వెర్బల్). రాత పరీక్షలో అర్హత సాధించిన వారికి ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పిఎఫ్‌టి), ఇనిషియల్ మెడికల్ ఎగ్జామినేషన్ (ప్రిలిమినరీ) నిర్వహిస్తారు.

వికలాంగులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు. రాత పరీక్షల్లో అర్హత సాధించిన వారందరికీ ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పిఎఫ్‌టి)నిర్వహించబడుతుంది. అభ్యర్థులందరూ స్పోర్ట్ రిగ్ (షూ, టీ-షర్టు, ట్రౌజర్ మొదలైనవి) ఉండాలని సూచించారు.

 దరఖాస్తు ప్రక్రియ 
ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా joinindiacoastguard.gov.in లో 30 నవంబర్ నుండి 07 డిసెంబర్ 2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల ఫోటో, సంతకం .jpeg ఫార్మాట్ లో అప్‌లోడ్ చేయాలి (ఫోటో నాణ్యత 200 డిపిఐ).

ఫోటో, సంతకం సైజ్ 10 kb నుండి 40 kb మధ్య ఉండాలి. దరఖాస్తు నింపిన తర్వాత, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయడానికి ముందు మీ వివరాలను మరోసారి చెక్ చేసుకోండి.

Follow Us:
Download App:
  • android
  • ios