భార‌త ప్రభుత్వ ర‌క్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఇండియ‌న్ కోస్ట్ గార్డ్‌ నావిక్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నిర్ణయించారు. సరైన అర్హతలు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్ నెస్ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికలు నిర్వహిస్తారు.ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం ఖాళీల సంఖ్య 260 భర్తీ చేయనున్నారు.

నోటిఫికేషన్ వివ‌రాలు

 నావిక్ (జ‌న‌ర‌ల్ డ్యూటీ) 10+2 ఎంట్రీ బ్యాచ్

also read IRCON'లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి

క్యాటగిరి వారీగా పోస్టుల కేటాయింపు:  జనరల్-113, ఈడబ్ల్యూఎస్-26, ఓబీసీ-75, ఎస్టీ-13, ఎస్సీ-33

అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్(మ్యాథ్స్, ఫిజిక్స్‌తో) లేదా తత్సమాన విద్యార్హత పొంది ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు 45 శాతం మార్కులు పొంది ఉంటే చాలు సరిపోతుంది.

వయోపరిమితి: అభ్యర్థుల వయస్సు 18-22 సంవత్సరాల మ‌ధ్య వారై ఉండాలి. 01.08.1998 - 31.07.2002 మధ్య జన్మించిన వారై ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు కల్పించారు.

ద‌ర‌ఖాస్తు: సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, మెడిక‌ల్ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపికలు నిర్వహిస్తారు.

శిక్షణ: ఎంపికైన అభ్యర్థులకు ఐఎన్‌ఎస్ చిల్కాలో ఆగస్టు 2020 నుంచి శిక్షణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులకు సముద్ర శిక్షణ, ప్రొఫెషనల్ శిక్షణ ఉంటుంది. శిక్షణ సమయంలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా వారికి ట్రేడ్‌లను కేటాయిస్తారు.

also read TSPSC Jobs: టి‌ఎస్‌పి‌ఎస్‌సి నోటిఫికేషన్ 2020 విడుదల...అప్లై చేసుకోవడానికి క్లిక్ చేయండి

జీతం: ఇండియన్ కోస్ట్‌గార్డులో చేరిన వారికి బేసిక్ పే కింద రూ.21,700 (పే లెవల్-3)తోపాటు డీఏ ఇస్తారు. పోస్టుల ఆధారంగా ఇతర అలవెన్సులు కూడా ఇస్తారు. ప్రమోషన్ సమయంలో ప్రధాన అధికారి ర్యాంకు కింద రూ.47,600 పే స్కేలు వర్తిస్తుంది. డీఏ, ఇతర అలవెన్సులు అదనం.


ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ 26.01.2020 చివరితేది: 02.02.2020.

అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: 15.02.2020 నుండి  22.02.2020.