భారత సైన్యంలో ‘‘ అగ్నివీర్ ’’లు కావాలనుకుంటున్నారా.. ఇవాళ్టీ నుంచే రిజిస్ట్రేషన్, పూర్తి వివరాలు ఇవే
భారత సైన్యం తన రాబోయే అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రకారం.. ఏప్రిల్‌లో వ్రాత పరీక్ష వుంటుంది.
భారత సైన్యం తన రాబోయే అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. ఫిబ్రవరి 8 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభమతువుంది. ఔత్సాహిక అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో [joinindianarmy.nic.in](https://joinindianarmy.nic.in/) దరఖాస్తు చేయవచ్చు. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ప్రకారం.. ఏప్రిల్‌లో వ్రాత పరీక్ష వుంటుంది. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు తదుపరి శారీరక పరీక్షలకు హాజరవుతారు. ఈ మేరకు కల్నల్ డీపీ సింగ్ గత నెలలో లూథియానాలో విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.
వయస్సు ప్రమాణాలు:
- అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17 నుంచి 21 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆర్మీ అగ్నివీర్ విద్యా అర్హతలు:
- జనరల్ డ్యూటీ ఖాళీలకు: కనీస విద్యార్హత 10వ తరగతి.
- ట్రేడ్స్‌మెన్ ఖాళీల కోసం: కనీస విద్యార్హత 8వ తరగతి.
దరఖాస్తు కోసం అవసరమైన పత్రాలు :
- 10వ తరగతి పాస్ సర్టిఫికెట్, పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, పుట్టిన తేదీతో సహా మెట్రిక్ సర్టిఫికేట్‌లోని వివరాలు సరిపోలినట్లు నిర్ధారించుకోవాలి.
- చెల్లుబాటు అయ్యే వ్యక్తిగత ఇమెయిల్
- వ్యక్తిగత మొబైల్ నంబర్.
- రాష్ట్రం, జిల్లా, నివాసించే ప్రాంతం తహసీల్/బ్లాక్ గురించిన వివరాలు (JCO/OR దరఖాస్తుకు మాత్రమే వర్తిస్తుంది)
- స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో (10 Kb నుండి 20 Kb, jpg ఫార్మాట్‌లోనే వుండాలి).
- స్కాన్ చేసిన సంతకం ఫోటో (5 Kb నుండి 10 Kb, .jpg ఫార్మాట్‌లోనే వుండాలి)
- దరఖాస్తు చేసిన కేటగిరీ, ప్రవేశాలకు సంబంధించిన అర్హత ప్రమాణాల ప్రకారం.. పదవ తరగతి, ఇతర ఉన్నత విద్యార్హతల మార్క్ షీట్
అర్హత వున్న అభ్యర్ధులు తక్షణమే దరఖాస్తు చేసుకోవాలని , సజావుగా ఈ ప్రక్రియ జరిగేందుకు అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లను సిద్ధం చేయాల్సిందిగా అధికారులు సూచించారు. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ ద్వారా భారత సైన్యంలో చేరి దేశానికి అంకితభావంతో సేవ చేయొచ్చు