Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశం.. దరఖాస్తు చేసుకోవడానికి వెంటనే క్లిక్ చేయండి..

ఐఎఎఫ్ ఎయిర్‌మెన్ రిక్రూట్‌మెంట్ 2021 ఆన్‌లైన్ ధరఖాస్తును airmenselection.cdac.in లేదా www.careerindianairforce.cdac.in. ద్వారా చేసుకోవచ్చు. 

Indian Air Force Airmen Recruitment 2021: Apply Online for Group X and Group Y Trades check full details Notification here
Author
Hyderabad, First Published Jan 22, 2021, 2:37 PM IST

భారత వైమానిక దళం (ఐఎఎఫ్)  గ్రూప్ 'ఎక్స్', గ్రూప్ 'వై' ట్రేడ్స్‌లో ఎయిర్‌మెన్ పోస్టులకు నియామకాల దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ధరఖాస్తు  ప్రక్రియను ప్రారంభ తేదీ  22 జనవరి 2021 , చివరి తేదీ 07 ఫిబ్రవరి 2021. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 

 ఐఎఎఫ్ ఎయిర్‌మెన్ రిక్రూట్‌మెంట్ 2021 ఆన్‌లైన్ ధరఖాస్తును airmenselection.cdac.in లేదా www.careerindianairforce.cdac.in. ద్వారా చేసుకోవచ్చు. భారత వైమానిక దళం (ఐఎఎఫ్) భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌కు చెందినది.

ఈ నోటిఫికేషన్‌ ద్వారా గ్రూప్‌-ఎక్స్ ‌(ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్రక్ట‌ర్ ట్రేడ్ మిన‌హాయించి), గ్రూప్‌-వై (ఐఏఎఫ్‌(ఎస్‌) & మ్యూజిషియ‌న్ ట్రేడ్ మిన‌హాయించి), గ్రూప్‌-వై (మెడిక‌ల్ అసిస్టెంట్ ట్రేడ్‌) పోస్టులను భర్తీ చేయనుంది. 

మరింత పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్  https://indianairforce.nic.in/  చూడవచ్చు.

అర్హ‌త‌:
1) గ్రూప్‌‌-ఎక్స్‌(ఎడ్యుకేష‌న్ ఇన్‌స్ట్రక్ట‌ర్ ట్రేడ్ మిన‌హాయించి): క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ త‌త్స‌మాన అర్హ‌త‌లో భాగంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్ స‌బ్జెక్టులు ఉన్న కోర్సులో ఉత్తీర్ణ‌త‌ పొంది ఉండాలి.
2) గ్రూప్‌-వై (ఐఏఎఫ్‌(ఎస్‌) & మ్యూజిషియ‌న్ ట్రేడ్ మిన‌హాయించి): క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/ త‌త్స‌మాన ప‌రీక్ష ఉత్తీర్ణ‌త‌ కలిగి ఉండాలి.
3) గ్రూప్‌-వై (మెడిక‌ల్ అసిస్టెంట్ ట్రేడ్‌): క‌నీసం 50 శాతం మార్కుల‌తో ఇంట‌ర్మీడియ‌ట్‌/  త‌త్స‌మాన అర్హ‌త‌లో భాగంగా మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్, కెమిస్ట్రీ, బ‌యోల‌జీ స‌బ్జెక్టులు ఉన్న కోర్సులో ఉత్తీర్ణ‌త‌ పొంది ఉండాలి.
4.గ్రూప్ ‘ఎక్స్’ పరీక్షకు అర్హులైన‌ అభ్యర్థులు (ఇంటర్మీడియట్ / 10 + 2 ఆధారంగా) గ్రూప్ ‘వై’కి సైతం అర్హులు అవుతారు.

also read సింగరేణి ఉద్యోగ నోటిఫికేషన్ 2021 విడుదల.. ఐ‌టి‌ఐ అర్హత ఉన్న వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ. ...

5.ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తులు నింపే స‌మ‌యంలో ఒకే సిట్టింగ్‌లో గ్రూప్ ‘ఎక్స్’, గ్రూప్ ‘వై’ పరీక్ష రెండింటిలోనూ హాజరయ్యే అవకాశం ఉంటుంది.
6.డిప్లొమా అభ్య‌ర్థులు గ్రూప్ ఎక్స్ ట్రేడ్‌కు మాత్రమే హాజరు కావడానికి అర్హులు.
7.వ‌యసు: అభ్యర్ధులు 21 ఏళ్ల‌కు మించ‌కూడ‌దు.

ఎంపిక చేసే విధానం: ఈ పోస్టులకు శ‌రీర దారుఢ్య ప‌రీక్ష‌, మెడిక‌ల్ ప‌రీక్ష‌, ఆన్‌లైన్ ప‌రీక్ష ఆధారంగా ఎంపికలు చేస్తారు.
1) గ్రూప్‌-ఎక్స్‌ పోస్టుల‌కు ప‌రీక్ష స‌మ‌యం 60 నిమిషాలు ఉంటుంది. ఇందులో ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్ ప్ర‌శ్న‌లు ఉంటాయి.
2) గ్రూప్‌-వై  పోస్టుల‌కు ప‌రీక్ష స‌మ‌యం 45 నిమిషాలు. ఇందులో ఇంగ్లిష్ రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ ప్ర‌శ్న‌లు ఉంటాయి.
3) రెండు ట్రేడ్‌ల‌కు ప‌రీక్ష రాసే అభ్య‌ర్థుల‌కు 85 నిమిషాలు స‌మ‌యం ఇస్తారు. అందులో ఇంగ్లిష్‌, ఫిజిక్స్‌, మ్యాథ్స్, రీజ‌నింగ్‌, జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్ ప్ర‌శ్న‌లు ఉంటాయి. ప్ర‌తీ త‌ప్పు స‌మాధానానికి 0.25 కట్ ఆఫ్  మార్క్ విధిస్తారు.

అధికారిక వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in/

Follow Us:
Download App:
  • android
  • ios