భార‌త ప్ర‌భుత్వ ర‌క్ష‌ణ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన హైదారాబాద్‌లోని డి‌ఆర్‌డి‌ఓ- డిఫెన్స్ మెటలర్జికల్ రీసెర్చ్ లాబొరేటరీ (డి‌ఎం‌ఆర్‌ఎల్ ) జూనియర్ రీసెర్చ్ ఫెలో (జే‌ఆర్‌ఎఫ్), రీసెర్చ్ అసోసియేట్ (ఆర్ఏ) పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఆసక్తిగల అభ్యర్ధులు 02 జనవరి 2021న లేదా అంతకు ముందు లోగా నిర్దేశించిన దరఖాస్తు ఫార్మాట్ ద్వారా డి‌ఆర్‌డి‌ఓ-డి‌ఎం‌ఆర్‌ఎల్ రిక్రూట్మెంట్ 2020 కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

మెట‌ల‌ర్జీ/ మెటీరియ‌ల్ సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మెకానిక‌ల్‌ తదితర విభాగాల్లో 21 పోస్టులు ఖాళీగా ఊన్నాయి. ఈ పోస్టుల కోసం ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఈ-మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఖాళీలు: 21
జూనియ‌ర్ రిసెర్చ్ ఫెలో(జేఆర్ఎఫ్‌)-18
రిసెర్చ్ అసోసియేట్‌(ఆర్ఏ)-03

also read 10వ తరగతి పాసైన వారికి ఇండియన్ కోస్ట్ గార్డ్ లో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండీ.. ...

ఖాళీ విభాగాలు: మెట‌ల‌ర్జీ/ మెటీరియ‌ల్ సైన్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మెకానిక‌ల్‌ తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి.
అర్హ‌త‌: పోస్టును బట్టి సంబంధిత స‌బ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ, ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
ద‌ర‌ఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఈమెయిల్: admin@dmrl.drdo.in
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 02.01.2021.
మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌:https://www.drdo.gov.in/ చూడవచ్చు.