పరీక్ష లేకుండా డైరెక్ట్ డీఆర్‌డీఓలో ఉద్యోగావకాశం.. నెలకు 31వేలు జీతం..

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీ-DLRL కోసం కొన్ని పోస్టుల్ని డీఆర్‌డీఓ భర్తీ చేస్తోంది. 

drdo dlrl recruitment 2020 10 jrf posts in defence electronics research laboratory hyderabad apply now

కరోనా కష్టకాలంలో నిరుద్యోగులకు, ఉద్యోగాలు కోల్పోయినవారికి  అద్భుతవకాశం. విద్యార్హతలు ఉండి ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునే వారికి సువర్ణావకాశం. పరీక్ష లేకుండానే డైరెక్ట్ డీఆర్‌డీఓలో ఉద్యోగం పొందేందుకు అవకాశం.

హైదరాబాద్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబరేటరీ-DLRL కోసం కొన్ని పోస్టుల్ని డీఆర్‌డీఓ భర్తీ చేస్తోంది. జూనియర్ రీసెర్చ్ ఫెలో(జే‌ఆర్‌ఎఫ్) పోస్టుల్ని ప్రకటించింది. 

 ఈ‌ నోటిఫికేషన్ లో మొత్తం 10 ఖాళీలున్నాయి. అందులో జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఈసీఈ)- 7, జూనియర్ రీసెర్చ్ ఫెలో (ఎంఈ)- 3 పోస్టులున్నాయి. మొత్తం రెండేళ్ల కాలానికి  పోస్టులను భర్తీ చేస్తున్నయి. ఒకవేళ రెండేళ్ల తరువాత అవసరాన్ని బట్టి గడువును పొడిగించే అవకాశం కూడా ఉంది.

అర్హత పొందిన వారిని డీఆర్‌డీఓ ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. 

also read తెలంగాణ పోలీస్ శాఖలో ఉద్యోగాలు.. నెలకు 20వేల జీతం.. ...

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 21 రోజుల్లో అప్లై చేసుకోవాలి. సెప్టెంబర్ 12 చివరి తేదీ లోగా అభ్యర్థులు దరఖస్తు చేయాలి. దరఖాస్తుల్ని నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా పోస్టులో పంపాలి.

 విద్యార్హత వివరాలు:  సంబంధిత బ్రాంచ్‌లో బీఈ లేదా బీటెక్ ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణులై  ఉండాలి. నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ లేదా గేట్ పరీక్షలో అర్హత సాదించి ఉండాలి లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ప్రొఫెషనల్ కోర్స్ (ఎంఈ లేదా ఎంటెక్) ఫస్ట్ డివిజన్‌లో పాస్ అయ్యి ఉండాలి. 

అభ్యర్థుల వయస్సు 28 ఏళ్ల లోపు ఉండాలి అంతకు మించి ఉండకూడదు. ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల పాటు వయస్సులో సడలింపు ఉంటుంది. ఉద్యోగాల్లో చేరిన వారికి నెల వేతనం రూ.31,000 ఇస్తారు. 

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్: 
The Director, Defense Electronics Research Laboratory (DLRL),

Ministry of Defence, DRDO Chandrayangutta Lines,
Hyderabad- 500005, Telangana. 

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://www.drdo.gov.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios