Asianet News TeluguAsianet News Telugu

CRPF JOBS: సిఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్ 2020 నోటిఫికేషన్ విడుదల.. వెంటనే అప్లై చేసుకొండి..

 సి‌ఆర్‌పి‌ఎఫ్ లో హెడ్‌ కానిస్టేబుల్‌, ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్‌ను భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రిత్వ శాఖ, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) విడుదల చేసింది. 

crpf recruitment 2020 notification released check out for vacancies and eligibility
Author
Hyderabad, First Published Jul 14, 2020, 4:52 PM IST

సిఆర్‌పిఎఫ్ రిక్రూట్‌మెంట్ 2020 నోటిఫికేషన్ విడుదలైంది. సి‌ఆర్‌పి‌ఎఫ్ లో హెడ్‌ కానిస్టేబుల్‌, ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల కోసం నియామక నోటిఫికేషన్‌ను భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రిత్వ శాఖ, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సిఆర్‌పిఎఫ్‌) విడుదల చేసింది. గ్రూప్ “బి”, “సి” నాన్-మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబటైసేడ్ పారామెడికల్ పోస్టుల క్రింద మొత్తం 789 ఖాళీలు ఉన్నట్లు తెలిపింది.

అర్హతగల, ఆసక్తిగల అభ్యర్థులు సి‌ఆర్‌పి‌ఎఫ్ పారామెడికల్ రిక్రూట్మెంట్ 2020 కోసం జూలై 20 నుండి ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ 31 ఆగస్టు 2020. పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు వారు అన్ని విద్యా అర్హతలు, వయస్సు, శారీరక ప్రమాణాలు, మొదలైనవాటికి వారు పోస్టులకు అర్హులు అని నిర్ధారించుకోవాల్సి ఉంటుంది.


దరఖాస్తు ప్రారంభతేదీ - 20 జూలై 2020
దరఖాస్తు చివరితేదీ -31 ఆగస్టు 2020
రాత పరీక్ష తేదీ - 20 డిసెంబర్ 2020


సి‌ఆర్‌పి‌ఎఫ్ ఖాళీ పోస్టుల వివరాలు
ఇన్స్పెక్టర్ (డైటీషియన్) - 01
సబ్ ఇన్స్పెక్టర్ (స్టాఫ్ నర్స్) - 175
సబ్ ఇన్స్పెక్టర్ (రేడియోగ్రాఫర్) - 08
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫార్మసిస్ట్) - 84
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఫిజియోథెరపిస్ట్) - 05
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (డెంటల్ టెక్నీషియన్) - 04
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (లాబొరేటరీ టెక్నీషియన్) - 64
అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ / ఎలక్ట్రో-కార్డియోగ్రఫీ టెక్నీషియన్ - 01
హెడ్ ​​కానిస్టేబుల్ (ఫిజియోథెరపీ అసిస్టెంట్ / నర్సింగ్ అసిస్టెంట్ / మెడిక్) - 99
హెడ్ ​​కానిస్టేబుల్ (ఏ‌ఎన్‌ఎం/ మిడ్ వైఫ్) - 3
హెడ్ ​​కానిస్టేబుల్ (డయాలసిస్ టెక్నీషియన్) - 8
హెడ్ ​​కానిస్టేబుల్ (జూనియర్ ఎక్స్-రే అసిస్టెంట్) - 84
హెడ్ ​​కానిస్టేబుల్ (లాబొరేటరీ అసిస్టెంట్) - 5
హెడ్ ​​కానిస్టేబుల్ (ఎలక్ట్రీషియన్) - 1
హెడ్ ​​కానిస్టేబుల్ (స్టీవార్డ్) - 3
కానిస్టేబుల్ (మసాల్చి) - 4
కానిస్టేబుల్ (కుక్) - 116

also read నిరుద్యోగులకు శుభవార్త.. పరీక్ష లేకుండా ఎస్బీఐ లో ఉద్యోగం ...


కానిస్టేబుల్ (సఫాయ్ కరంచారి) - 121
కానిస్టేబుల్ (ధోబీ / వాషర్మాన్) - 5
కానిస్టేబుల్ (డబల్యూ / సి) - 3
కానిస్టేబుల్ (టేబుల్ బాయ్) - 1
హెడ్ ​​కానిస్టేబుల్ (వెటర్నరీ) - 3
హెడ్ ​​కానిస్టేబుల్ (ల్యాబ్ టెక్నీషియన్) - 1
హెడ్ ​​కానిస్టేబుల్ (రేడియోగ్రాఫర్ - 1

వయో పరిమితి:
సబ్ ఇన్స్పెక్టర్ - 30 సంవత్సరాలు
అసిస్టెంట్ సబ్ - ఇన్స్పెక్టర్ - 20 నుండి 25 సంవత్సరాలు
హెడ్ ​​కానిస్టేబుల్ - 18 నుండి 25 సంవత్సరాలు
హెడ్ ​​కానిస్టేబుల్ (జూనియర్ ఎక్స్-రే అసిస్టెంట్ / లాబొరేటరీ అసిస్టెంట్ / ఎలక్ట్రీషియన్) - 20 నుండి 25 సంవత్సరాలు
హెడ్ ​​కానిస్టేబుల్ (స్టీవార్డ్) ,కానిస్టేబుల్ -18 నుండి 23 సంవత్సరాలు

అర్హతగల అభ్యర్థులు తమ దరఖాస్తును అన్ని సంబంధిత పత్రాల ఫోటోకాపీలతో పాటు, 02 తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను కింది అడ్రస్ పంపించాల్సి ఉంటుంది.

DIGP, Group Centre, CRPF, Bhopal, Village-Bangrasia, Taluk-Huzoor, District-Bhopal, M.P.-462045

 అడ్రసుకు కు జూలై 20 నుంచి 31 ఆగస్టు 2020లోగా పంపల్సి ఉంటుంది. పరీక్ష పేరును  “సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పారామెడికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్, 2020” అని ఏన్విలప్ పైన తప్పకుండ వ్రాయలి.

కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఇన్స్పెక్టర్, ఏ‌ఎస్‌ఐ & ఎస్‌ఐ పోస్ట్లల అర్హత కోసం అధికారిక వెబ్ సైట్ చూడండి. 


పరీక్ష ఫీజు:
గ్రూప్ బి - రూ. 200 / -
గ్రూప్ సి - రూ. 100 / -
దరఖాస్తు ఫీజు చెల్లించాల్సిన అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ ఆర్డర్ లేదా బ్యాంక్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించవచ్చు.
 

Follow Us:
Download App:
  • android
  • ios