Asianet News TeluguAsianet News Telugu

Central Government Jobs: ప‌ది అర్హ‌త‌తో కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. వివ‌రాల కోసం క్లిక్ చేయండి..!

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల(central jobs) కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న 10వ, 12వ, గ్రాడ్యుయేషన్ అభ్యర్థుల కోసం ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

Central Government Jobs with Tenth class Eligibility
Author
Hyderabad, First Published Jan 14, 2022, 2:42 PM IST

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ప్రభుత్వ ఉద్యోగాల కోసం చూస్తున్న 10వ, 12వ, గ్రాడ్యుయేషన్ అభ్యర్థుల కోసం ఉద్యోగుల స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. శనివారం నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాబోతోంది. వీటిలో తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు ఉన్నాయి.

*భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య:3820
-అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌(యూడీసీ)–1726,
-స్టెనోగ్రాఫర్‌ –163,
-మల్టీటాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌)–1931

*తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలు:
-ఏపీ:35, యూడీసీ (07), ఎంటీఎస్ (26), స్టెనో (02).
-తెలంగాణ‌: 72, యూడీసీ (25), ఎంటీఎస్ (43), స్టెనో (04).

విద్యార్హతలు:
-ఎంటీఎస్‌ పోస్టులకు సంబంధించి పదో తరగతి లేదా తత్సమాన -స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యార్హతలో ఉత్తీర్ణత.
-అప్పర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.

*స్టేనో, యూడీసీ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు 18-27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకునే వారు 18-25 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
*దరఖాస్తు విధానం: ఆన్ లైన్
*ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్‌ రాత పరీక్ష, స్కిల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక.
*ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ 15-01-2022న ప్రారంభ‌మ‌వుతుంది.
*ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు చివరి తేదీ 15-02-2022
పూర్తి వివరాలకు నోటిఫికేషన్: https://www.esic.nic.in/

Follow Us:
Download App:
  • android
  • ios