Asianet News TeluguAsianet News Telugu

డిగ్రీ, పీజీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. కొద్దిరోజులే అవకాశం.. వెంటనే అప్లయి చేసుకోండీ..

ఢీల్లీ ప్రభుత్వం,  స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్లానింగ్ విభాగం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అండ్ సూపరింటెండెంట్ (ప్రింటింగ్), శాసన విభాగం, మినిస్ట్రీ ఆఫ్ లా శాఖలలో ఉద్యోగాలకు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

Applications invited for 36 Statistical Officer & Superintendent Posts Apply  at  upsc.gov.in
Author
Hyderabad, First Published Nov 30, 2020, 5:48 PM IST

యూనియ‌న్ ప‌బ్లిక్ సర్వీస్ క‌మిష‌న్ (యూపీఎస్‌సి) వివిధ కేంద్ర మంత్రిత్వ‌శాఖ‌ల్లో 36 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో ఢీల్లీ ప్రభుత్వం,  స్టాటిస్టికల్ ఆఫీసర్ ప్లానింగ్ విభాగం, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అండ్ సూపరింటెండెంట్ (ప్రింటింగ్), శాసన విభాగం, మినిస్ట్రీ ఆఫ్ లా శాఖలలో ఉద్యోగాలకు కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యుపిఎస్‌సి) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్ట్‌లకు ఆన్‌లైన్ ద్వారా 17 డిసెంబర్ 2020 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉన్న వాళ్లు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ధరఖాస్తు సమర్పించిన తరువాత అభ్యర్థులు భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ప్రింటౌట్ తీసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు: 36
నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అండ్ సూపరింటెండెంట్ (ప్రింటింగ్)- 01

also read నెలకు 24వేల వేతనంతో ఎన్‌టీపీసీలో ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకొండి.. ...
శాసన విభాగం, మినిస్ట్రీ ఆఫ్ లా, ఢీల్లీ ప్రభుత్వం, స్టాటిస్టిక‌ల్ ఆఫీస‌ర్ - 35

అర్హ‌త‌: పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో పీజీ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభ‌వం ఉండాలి.
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి‌.
ద‌ర‌ఖాస్తు చివ‌రి తేది: 17 డిసెంబర్‌ 2020.
అధికారిక వెబ్‌సైట్‌:https://www.upsc.gov.in/

Follow Us:
Download App:
  • android
  • ios