నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్‌న్యూస్ తెలిపారు. రాష్ట్రంలోని పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఒక కీలక ప్రకటన విడుదల చేశారు. విజయవాడలో జరిగిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న  ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ నోటిఫికేషన్‌పై  స్పందించారు.

ఈ ఏడాది డిసెంబర్‌లో పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తామని చెప్పారు. నాలుగు దశల్లో మొత్తం 6500 పోస్టుల భర్తీ చేయనున్నట్లు తెలపగ అలాగే పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తాని అన్నారు.

అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని, మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామని ఆన్నారు.

also read ఆ మాటలు వినడంతో అవమానంతో చాలా బాధపడ్డా.. రతన్ టాటా మర్చిపోలేని సంఘటన.. ...

సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి అవగాహన కల్పించామని, పోలీస్ సేవా యాప్‌ కూడా తీసుకొచ్చామని గుర్తుచేశారు.

విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని, కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారని అలాగే  కరోనాతో మృతిచెందిన పోలీసులకు సీఎం రూ.50లక్షలు ప్రకటించారని, పోలీసులకు వీక్లీ ఆఫ్‌, హోంగార్డుల జీతాల పెంపులాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీకి 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయని  సవాళ్లు ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు.