Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టులో భారీగా ఉద్యోగాలు.. నెలకు 25వేలకు పైగా జీతం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ..

ఆంధ్ర‌‌ప్ర‌దేశ్ హైకోర్టు (హైకోర్ట్ ఆఫ్ ఏపీ) 55 సివిల్ జ‌డ్జి పోస్టుల భ‌ర్తీ కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తులులను  ఆహ్వానిస్తున్నది. మొత్తం భర్తీకి ఉన్న 55 పోస్టుల్లో 18 పోస్టులు మహిళలకు, మిగిలినవి పురుషులకు కేటాయించారు. 

andhrapradesh  High Court Recruitment 2021 released : Apply for 55 Civil Judge (Jr Division) Posts  at official website
Author
Hyderabad, First Published Dec 8, 2020, 4:23 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అమ‌రావతిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు (హైకోర్ట్ ఆఫ్ ఏపీ) 55 సివిల్ జ‌డ్జి పోస్టుల భ‌ర్తీ కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుండి ద‌ర‌ఖాస్తులులను  ఆహ్వానిస్తున్నది. మొత్తం భర్తీకి ఉన్న 55 పోస్టుల్లో 18 పోస్టులు మహిళలకు, మిగిలినవి పురుషులకు కేటాయించారు.

ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ధరఖాస్తు ప్రక్రియ మొదలైంది, ధరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ  2 జనవరి 2021. ఈ పోస్టులను స్క్రీనింగ్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ద్వారా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్ సైట్  http://hc.ap.nic.in/ లో చూడవచ్చు.  

పోస్ట్ : సివిల్ జ‌డ్జి (జూనియ‌ర్ డివిజ‌న్‌)

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి‌.

దరఖాస్తు ఫీజు: రూ.800

వయసు: 1 డిసెంబర్‌ 2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపు ఉంటుంది.

also read తెలంగాణలో ఎస్‌బి‌ఐ బ్యాంక్‌ ఉద్యోగాలు‌.. కొద్దిరోజులు మాత్రమే అవకాశం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...

ఎంపిక చేసే విధానం: స్క్రీనింగ్‌ టెస్ట్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ద్వారా ఎంపిక చేస్తారు.

పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 02 జనవరి 2021.

అధికారిక వెబ్‌సైట్‌:http://hc.ap.nic.in/

జీతం: రూ.27,700 నుండి రూ.44,700

Follow Us:
Download App:
  • android
  • ios