79 ట్రైనీ కంట్రోలర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్(డీఈఓ) పోస్టుల భర్తీకి  ఎయిర్ ఇండియా లిమిటెడ్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని కోరింది.

ఏప్రిల్ 30, మే 02, 2019 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే ఇంటర్వ్యూలకు ఉదయం 10.30గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల సమయంలో హాజరుకావాలని తెలిపింది. 

పోస్టుల పేరు: ట్రైనీ కంట్రోలర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్(డీఈఓ)

సంస్త: ఎయిర్ ఇండియా లిమిటెడ్

విద్యార్హత: బీఈ/బీటెక్/డిప్లొమా/గ్రాడ్యూయేషన్

అనుభవం: నోటిఫికేషన్‌లో పేర్కొనబడిన విధంగా.

జాబ్ లొకేషన్: ముంబై, ఢిల్లీ

జీతం వివరాలు: సీనియర్ ట్రైనీ ఫ్లైట్ డిస్పాచర్: ట్రైనీ కంట్రోలర్స్: నెలకు రూ.25,000, డేటా ఎంట్రీ ఆపరేటర్(డీఈఓ)లకు నెలకు రూ. 21,000.

ట్రైనీ కంట్రోలర్స్ పోస్టుల సంఖ్య: 25

డేటా ఎంట్రీ ఆపరేటర్స్ పోస్టుల సంఖ్య: 54

దరఖాస్తుల ప్రారంభ తేదీ: ఏప్రిల్ 30, 2019
దరఖాస్తులకు చివరి తేదీ: మే 2, 2019

వయో పరిమితి: నోటిఫికేషన్ వెలుడిన(ఏప్రిల్ 01, 2019) నాటికి 42ఏళ్లు(జనరల్) మించరాదు. ఓబీసీలకు 45ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 47ఏళ్లు, మించరాదు.

జనరల్, ఓబీసీ ట్రైనీ కంట్రోలర్స్ అభ్యర్థులు రూ. 1000, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించాలి. ఫీజు డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీలకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరీఫికేషన్ ఆధారంగా.