Asianet News TeluguAsianet News Telugu

ఉప్పల్‌ ఎన్‌జీఆర్ఐలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ద్వార భ‌ర్తీ

నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. 

66 project associate scientist assistant posts in ngri hyderabad uppal
Author
Hyderabad, First Published Sep 19, 2020, 11:45 AM IST

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ న‌గ‌రంలోని‌ ఉప్పల్‌లో ఉన్న నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ)లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ అసోసియేట్‌, ప్రాజెక్ట్ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది.

ఈ నోటిఫికేష‌న్ ద్వారా 66 పోస్టులను భర్తీ చేయ‌నుంది. ఆస‌క్తి గల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు సెప్టెంబ‌ర్ 25 వ‌ర‌కు అందుబాటులో ఉంటాయ‌ని వెల్ల‌డించింది. 

మొత్తం ఖాళీగా ఉన్న పోస్టులు: 66 

ఇందులో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ 45, ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ 18, ప్రాజెక్ట్‌  అసిస్టెంట్ 3 ఖాళీల చొప్పున ఉన్నాయి. 

అర్హ‌త‌: స‌ంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ లేదా పీహెచ్‌డీ చేసి ఉండాలి. అనుభ‌వం త‌ప్ప‌నిస‌రి. 35 నుంచి 50 ఏండ్ల లోపు వ‌య‌స్సు క‌లిగిన‌వారై ఉండాలి. 

ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపికలు ఉంటాయి

ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌: ఆన్‌లైన్‌ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

అప్లికేష‌న్ల‌కు చివ‌రితేదీ: సెప్టెంబ‌ర్ 25

అధికారిక వెబ్‌సైట్‌: www.ngri.org.in

Follow Us:
Download App:
  • android
  • ios