బీటెక్‌ స్టూడెంట్స్ కి గోల్డెన్‌ ఛాన్స్‌.. విప్రోలో భారీగా ఉద్యోగాలు.. వెంటనే ఇక్కడ క్లిక్ చేయండి..

ఐటీ కంపెనీ విప్రో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహానిస్తుంది. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ విద్యార్థులు 2022 సంవత్సరంలో బీటెక్ పాస్ కావాల్సి ఉంటుంది. 
 

Golden Chance for BTech students.. 30,000 jobs for freshers at Wipro .. Salary of Rs. 3,50,000 per annum

బీటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఒకటైన విప్రో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహానిస్తుంది. ఇందులో భాగంగా ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లను నియమించేందుకు ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్ (Wipro Elite National Talent Hunt) నిర్వహిస్తోంది.

ఇది ఒక ఫ్రెషర్స్ కోసం విప్రో నిర్వహిస్తున్న హైరింగ్ ప్రోగ్రామ్. ప్రస్తుతం బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ విద్యార్థులు 2022 సంవత్సరంలో బీటెక్ పాస్ కావాల్సి ఉంటుంది. ఈ హైరింగ్ ప్రోగ్రామ్ ద్వారా 30వేల మంది ఫ్రెషర్స్‌కి విప్రో ఆఫర్ లెటర్స్ ఇవ్వనుంది. ఎంపికైన వారు 2022-23 సంవత్సరంలో ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కు డైరెక్ట్‌ లింక్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

 విద్యార్హతలు: కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫుల్ టైమ్ బీఈ లేదా బీటెక్ లేదా ఎంఈ లేదా ఎంటెక్ (ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్స్) చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీళ్లు 2022లో కోర్సు పాస్ కావాలి. ఫ్యాషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ తప్ప ఇతర బ్రాంచ్‌లలో టెక్నికల్‌ కోర్సు చేసిన, చేస్తున్న వారు అప్లయ్‌ చేయాలి.

అలాగే అభ్యర్థులు 60 శాతం లేదా 6.0 సి‌జి‌పి‌ఏ లేదా యూనివర్సిటీ గైడ్‌లైన్స్ ప్రకారం తత్సమాన మార్కులతో పాస్ కావాలి. టెన్త్, ఇంటర్, డిగ్రీ డిస్టెన్స్ లెర్నింగ్, కరస్పాండెన్స్ కోర్స్, పార్ట్ టైమ్ కోర్స్ చదివినవారికి అవకాశం లేదు. ఫుల్ టైమ్ కోర్సులు చదివే వారికి మాత్రమే అవకాశం. టెన్త్, ఇంటర్‌లో 60 శాతం పైగా మార్కులు సాధించి ఉండాలి.

also read 10వ తరగతి పాసైన వారికి ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. వెంటనే ఇలా అప్లయ్ చేసుకొండి..

ఇతర అంశాలు: అసెస్‌మెంట్ దశలో ఒక బ్యాక్‌లాగ్ ఉంటే అనుమతి ఇస్తారు. అన్ని బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేస్తేనే ఆఫర్ లభిస్తుంది. టెన్త్ నుంచి గ్రాడ్యుయేషన్ వరకు 2022 నాటికి గరిష్టంగా మూడేళ్లు ఎడ్యుకేషన్ గ్యాప్ అనుమతిస్తారు. గత ఆరు నెలల్లో విప్రో నిర్వహించిన ఇతర సెలెక్షన్ ప్రాసెస్‌లో పాల్గొనే వారు అర్హులు కాదు.

వయస్సు: అభ్యర్థుల వయసు 25 ఏళ్ల లోపు ఉండాలి.
డిసిగ్నేషన్: ప్రాజెక్ట్ ఇంజనీర్
వేతనం: ఏడాదికి రూ.3,50,000
సర్వీస్ అగ్రిమెంట్: 12 నెలలు

ఎంపిక ప్రక్రియ: ఎలైట్ నేషనల్ టాలెంట్ హంట్‌కు విజయవంతంగా రిజిస్ట్రేషన్ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఆ తర్వాత బిజినెస్ డిస్కషన్ ఉంటుంది. ఇందులో అభ్యర్థుల టాలెంట్‌ను పరిశీలించిన తర్వాత లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఆఫర్ లెటర్ వస్తుంది.

ఆన్‌లైన్ అసెస్‌మెంట్: ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌లో మూడు సెక్షన్స్ ఉంటాయి. మొత్తం 128 నిమిషాలు ఆన్‌లైన్ అసెస్‌మెంట్ ఉంటుంది. ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ లాజికల్ ఎబిలిటీ, క్వాంటిటేటీవ్ ఎబిలిటీ, ఇంగ్లీష్ (వర్బల్) ఎబిలిటీకి 48 నిమిషాలు ఉంటుంది. ఎస్సే రైటింగ్ 20 నిమిషాలు, ఆన్‌లైన్ ప్రోగ్రామింగ్ టెస్ట్ ఫీచరింగ్ 60 నిమిషాలు ఉంటుంది. కోడింగ్‌లో రెండు ప్రోగ్రామ్స్‌కు సంబంధించినవి ఉంటాయి.

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23 ఆగస్టు 2021
దరఖాస్తులకు చివరి తేదీ: 15 సెప్టెంబర్ 2021
ఆన్‌లైన్ అసైన్‌మెంట్: 25, 27 సెప్టెంబర్ 2021 
రిజిస్ట్రేషన్ లింక్:https://careers.wipro.com/elite

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios