ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. నిరుద్యోగులు మార్చ్ 31లోగా ధరఖాస్తు చేసుకోండీ..
ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులని భర్తీ చేయనుంది.
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా విభాగాల్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులని భర్తీ చేయనుంది.
ఈ పోస్టులకు సంబందించి మార్చి 1న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అలాగే మార్చి 31 దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్ సైట్ https://fci.gov.in/ లేదా https://www.recruitmentfci.in/లో చూడవచ్చు.
ఎఫ్‌సిఐలో ఉన్న మొత్తం ఖాళీల సంఖ్య - 89
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (జనరల్ అడ్మినిస్ట్రేషన్)- 30
ఎస్‌సి-3, ఎస్‌టి-3, ఓబిసి-9, ఈడబల్యూఎస్-3, యూఆర్-12
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (టెక్నికల్)- 27
ఎస్‌సి-5, ఎస్‌టి-1, ఓబిసి-4, ఈడబల్యూఎస్-3, యూఆర్-14
also read బీటెక్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి వెంటనే క్లిక్ చేయండి.. ...
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (అకౌంట్స్)- 22
ఎస్‌సి-4, ఎస్‌టి-1, ఓబిసి-3, ఈడబల్యూఎస్-2, యూఆర్-12
అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (లా)- 8
ఎస్‌సి-1, ఎస్‌టి-1, ఓబిసి-1, ఈడబల్యూఎస్-1, యూఆర్-4
మెడికల్ ఆఫీసర్- 2
ఎస్‌సి-1, ఎస్‌టి-0, ఓబిసి-0, ఈడబల్యూఎస్-0, యూఆర్-1
విద్యార్హతలు: పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలు నిర్ణయించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం నోటిఫికేషన్‌లో చూడవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్‌సి, ఎస్‌టి, దివ్యాంగులు, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక చేసే విధానం: ఈ పోస్టులను ఆన్‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం: రూ.50,000 నుంచి రూ.1,80,000 ఉంటుంది.
దరఖాస్తులు ప్రారంభ తేదీ: 1 మార్చి 2021
దరఖాస్తులు చివరి తేదీ: 31 మార్చి 2021
అధికారిక వెబ్‌సైట్: https://fci.gov.in/