బీటెక్‌ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు.. ధరఖాస్తు చేసుకోవడానికి వెంటనే క్లిక్ చేయండి..

ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 40 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం బీటెక్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

indian army tgc recruitment 2021 apply online for 133 technical graduate course at joinindianarmy nic in website

ఇండియన్ ఆర్మీ 133 టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్స్ (టి‌జి‌సి-133) రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 40 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ కోసం బీటెక్ పాసైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

గమనిక:  అవివాహిత యువకులు మాత్రమే  దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 26 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం  అధికారిక  వెబ్‌సైట్‌ https://joinindianarmy.nic.in/ లో చూడొచ్చు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి డెహ్రడూన్‌లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో 49 వారాల పాటు  శిక్షణ ఉంటుంది.

మొత్తం ఖలీల వివరాలు:  సివిల్ లేదా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ- 11, ఆర్కిటెక్చర్- 1, ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్- 4, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ టెక్నాలజీ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్- 9, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 3, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్- 2, టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 1, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్- 1, శాటిలైట్ కమ్యూనికేషన్- 1, ఏరోనాటికల్ లేదా ఏరోస్పేస్ లేదా ఏవియానిక్స్- 3, ఆటోమొబైల్, ఇంజనీరింగ్- 1, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్- 1

also read  ఆర్‌బిఐ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2021 విడుదల.. 10th పాసైన వారు వెంటనే ధరఖాస్తు చేసుకోండీ.. ...

విద్యార్హతలు: సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్ ఫైనలియర్‌ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2021 జూలై 1 నాటికి 20 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులు ప్రారంభ తేదీ : 25 ఫిబ్రవరి 2021
దరఖాస్తుల చివరి తేదీ: 26 మార్చి 2021
అధికారిక వెబ్‌సైట్‌:https://joinindianarmy.nic.in/

  దరఖాస్తు చేసుకోండి ఈ విధంగా పాటించండి:
మొదట https://joinindianarmy.nic.in/ అధికారిక వెబ్‌సైట్‌లోకి  లాగిన్‌ కావాలి. తరువాత Officers Entry Login ట్యాబ్ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ ట్యాబ్ క్లిక్ చేసి మీ పూర్తి వివరాలు ఎంటర్ చేయాలి. దీని తరువాత మీ ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. చివరగా మీ వివరాలన్నీ ఓసారి సరిచూసుకుని సబ్మిట్ చేసి ప్రింట్‌ తీసుకోవాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios