భారత ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా ఉన్న ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులను భర్తీ చేయనుంది.  

ఈ పోస్టుల భర్తీకి సంబంధించి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఈ ఇంటర్వ్యూలు జూన్‌ 15,16 తేదీల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌  http://www.ecil.co.in/ చూడవచ్చు.

1. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 12
విభాగాలు: ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్‌
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే  మూడేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏప్రిల్‌ 2021 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
జీతాలు: నెలకు రూ.40 వేలు

also read హైదరాబాద్ డి‌ఆర్‌డి‌ఓలో ఉద్యోగాలు.. నెలకు 30వేలకు పైగా జీతం.. వెంటనే ధరఖాస్తు చేసుకోండీ ...

2. అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 8
విభాగాలు: ఈఈఈ, ఈసీఈ, ఈఐఈ, మెకానికల్‌
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత పొంది ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.
వయసు: 30 ఏప్రిల్‌ 2021 నాటికి 25 ఏళ్లు మించకూడదు.
జీతాలు: నెలకు రూ.30 వేలు 

ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ తేదీలు: 15,16 జూన్‌ 2021 తేదీల్లో నిర్వహిస్తారు. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు జూన్‌ 15వ తేదీన, అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు జూన్‌ 16వ తేదీన ఇంటర్వ్యూల నిర్వహణ ఉంటుంది.
ఇంటర్వ్యూ వేదిక:
ECIL Regional Office, 
H.No. 47-09-28, 
Mukund Suvasa Apartments, 
3rd Lane Dwaraka Nagar, 
Visakhapatnam-530016
అధికారిక వెబ్‌సైట్‌: http://www.ecil.co.in/