డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్..

డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16 ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నారు.
 

digital india corporation recruitment 2021 released apply online for 16 vacancy jobs check details at dic gov in

ఎల‌క్ట్రానిక్స్, ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలోని డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్‌లో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా  మొత్తం 16 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

ఇందులో పీహెచ్‌పీ డెవ‌ల‌ప‌ర్‌, సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్ అన‌లిటిక్స్‌, డిజైన‌ర్ వంటి పోస్టులు ఉన్నాయి. అర్హ‌త, ఆసక్తిగల అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

1 జులై దరఖాస్తు చేసుకోవడానికి చివరితేది. ఈ పోస్టులను ఎలాంటి రాత ప‌రీక్ష లేకుండా ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌  https://www.dic.gov.in/లో చూడవచ్చు.

మొత్తం ఖాళీ పోస్టుల సంఖ్య 16 వీటిలో సీనియ‌ర్ డెవ‌ల‌ప‌ర్- 3, డెవ‌ల‌ప‌ర్- 6, సాఫ్ట్‌వేర్ టెస్ట‌ర్, క‌మ్ డెవ‌ల‌ప‌ర్- 2, సిస్ట‌మ్ అడ్మినిస్ట్రేట‌ర్- 1, కంటెంట్ మేనేజ‌ర్ లేదా రైట‌ర్- 2, డిజైన‌ర్- 2

also read రాత పరీక్ష లేకుండా సింగరేణిలో భారీగా ఉద్యోగవకాశాలు.. మార్కుల ఆధారంగా డైరెక్ట్ జాబ్.. ...

అర్హ‌త‌లు: డిజైన‌ర్, కంటెంట్ మేనేజ‌ర్ పోస్టుల‌కు సంబంధిత స‌బ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మిగిలిన పోస్టుల‌కు బీఈ లేదా ఎం‌ఎస్‌సి లేదా ఎంసీఏ చేసి ఉండాలి. అలాగే అనుభ‌వం కూడా ఉండాలి.

ఎంపిక ప్ర‌క్రియ‌: ఇంట‌ర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: 1 జూలై  2021

అధికారిక వెబ్‌సైట్‌: https://www.meity.gov.in/ లేదా https://negd.gov.in/

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios