భారతదేశ రాజధాని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 1492 పోస్టులు భర్తీ చేయనున్నారు ఇందులో ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్, కాంట్రాక్ట్ పోస్టులను డీఎంఆర్‌సీ భర్తీ చేయనుంది. డిసెంబరు 14న ఉద్యోగ ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

also read నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం...రేపు ఒక్క రోజే మాత్రమే...

ఎంప్లాయిమెంట్ న్యూస్ పత్రికలోనూ నోటిఫికేషన్ ప్రచురితం కానుంది. అదే రోజు నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు పోస్టులు, అర్హతలు ఎంపిక విధానం మరింత సమాచారం కోసం డిసెంబరు 14 న వెబ్‌సైట్ లో చూడవచ్చు.


పోస్టుల వివరాలు

మొత్తం ఖాళీలు: 1492

ఎగ్జిక్యూటివ్ (రెగ్యులర్), నాన్-ఎగ్జిక్యూటివ్ (రెగ్యులర్), ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్), నాన్-ఎగ్జిక్యూటివ్ (కాంట్రాక్ట్)