ఈ వేసవి సెలవుల్లో ఆన్ లైన్ కోర్సులు నేర్చుకోండిలా...
ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండి ఏదైనా ఆన్ లైన్ కోర్సులు చేయాలనుకున్న తీరిక సమయం ఉండదు. అలాగే వారానికి ఒకసారి వచ్చే వారాంతపు సెలవు ఆదివారం కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది అది కూడా రెస్ట్ తీసుకోవడానికి, ఏదైనా పనులు చేసుకోవడానికి సరిపోతుంది.
ఉద్యోగం చేసే వారికి ఇల్లు, ఆఫీసు తప్ప మరే ధ్యాస ఉండదు. అన్నీ పనులు వారే చూసుకోవాల్సి ఉంటుంది. ఖాళీ సమయాల్లో ఇంట్లో ఉండి ఏదైనా ఆన్ లైన్ కోర్సులు చేయాలనుకున్న తీరిక సమయం ఉండదు. అలాగే వారానికి ఒకసారి వచ్చే వారాంతపు సెలవు ఆదివారం కూడా ఇలా వచ్చి అలా వెళ్లిపోతుంది అది కూడా రెస్ట్ తీసుకోవడానికి, ఏదైనా పనులు చేసుకోవడానికి సరిపోతుంది.
ప్రస్తుతం సెలవుల రావడంతో ఉద్యోగం చేయాలనుకునే వారికి, ఉద్యోగం చేస్తున్న వారికి కరోనా లక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండే వారికి ఇప్పుడు ఒక చక్కటి ఆవశకం ఉంది. అదెంటంటే ఇంట్లో ఉండి ఆన్ లైన్ కోర్సులు చేయాలనుకునే వారు, చేయాలని ఇష్టం ఉన్న వాళ్ళు ఇదే సరైన అవకాశం.
క్వారెంటైన్ వల్ల 21 రోజులు లక్ డౌన్ అందులో కొన్ని రోజులు గడిచిపోయాయి. మిగిలిని ఈ సెలవుల్లో అయినా ఉచితంగా కోర్సులు నేర్పించేందుకు కొన్ని వెబ్‌సైట్లు ముందుకు వస్తున్నాయి. ఆ కోర్సులేంటో ఒకసారి చూడండి.
1. ఫొటోగ్రఫీ : అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్స్ ఆన్‌లైన్ ఫొటోగ్రఫీ కోర్సులు అందిస్తున్నారు. ఈ పేరుతో వెబ్‌సైట్ అందుబాటులో కూడా ఉన్నది.ఇక్కడ మొత్తం 1,100 పైగా కోర్సులున్నాయి. ఉచితంగా అకౌంట్ క్రియేట్ చేసి ఫొటోగ్రఫీ కోర్స్ నేర్చుకోవచ్చు.
2. స్మార్ట్ సిటీస్ : వీటి లాభాల గురించి ఓపెన్ యూనివర్సిటీలో రెండు వారాల కోర్స్ ఉంది. స్మార్ట్ సిటీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని పొందేందుకు ఈ కోర్స్ చాలా ఉపయోగపడుతుంది.
3. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ : స్మార్ట్‌ఫోన్ల నుంచి అత్యాధునిక వైద్య పరికరాల వరకు అంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే హవా. ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అందిస్తోంది.
ఇంతే కాకుండా ఇంకా మరెన్నో కోర్స్లులు అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం సంబంధిత వెబ్ సైట్ పై క్లిక్ చేయండి.